Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ కేసులో ట్విస్ట్ : అప్పుడు హత్య అని చెప్పిన డాక్టర్ ఇప్పుడు ఆత్మహత్య అంటున్నాడు!

సుశాంత్ కేసులో ట్విస్ట్ : అప్పుడు హత్య అని చెప్పిన డాక్టర్ ఇప్పుడు ఆత్మహత్య అంటున్నాడు!


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎయిమ్స్ డాక్టర్లు ఇటీవల సీబీఐకి రిపోర్ట్ ఇచ్చినట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో మూడున్నర నెలలుగా మిస్టరీగా ఉన్న సుశాంత్ డెత్ కేసు ఓ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే సుశాంత్ కేసుని మొదటి నుంచి ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వస్తున్న నేషనల్ ఛానల్ రిపబ్లిక్ టీవీ మాత్రం ఈ కేసులో అనేక అనుమానాలు రేకెత్తించే కథనాలు వెలువరుస్తోంది. యువ హీరోది ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా నేడు(సోమవారం) కొన్ని రుజువులను సాక్ష్యాలను బయటపెడతామని చెప్పడంతో యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా రిపబ్లిక్ టీవీ సుశాంత్ కేసులో ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా వ్యవహరించిన తీరు అనేక అనుమానాలు కలిగిస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తూ కథనం ప్రసారం చేసింది.

రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం సుశాంత్ పోస్టుమార్టం వెంట వెంటనే ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆగష్టు 22న ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న గదిలో క్రైమ్ సీన్ ను ధ్వంసం చేశారని.. కొన్ని ఆధారాలను సేకరించలేకపోయారనే అనుమానం లేవనెత్తారు సైతం డాక్టర్ సుధీర్ గుప్తా. సుశాంత్ మృతి చెందగానే హాస్పిటల్ కు తీసుకెళ్లి నేరుగా మార్చురీకి తీసుకెళ్లడం జరిగిందని.. అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించకుండానే మార్చురీకి ఎలా తీసుకెళ్లారని ఆగష్టు 22న సుధీర్ గుప్తా ప్రశ్నించారు. అంతేకాకుండా పోస్టుమార్టం రిపోర్టులో సుశాంత్ సింగ్ చనిపోయిన సమయాన్ని కూడా పొందుపర్చలేదని ఆయన చెప్పారు.

అయితే అప్పుడు పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని లోపాలున్నాయన్న సుధీర్ గుప్తా ఇప్పుడు మాట మార్చడంపై రిపబ్లిక్ టీవీ అనుమానాలు వ్యక్తం చేసింది. హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుశాంత్ ది ఆత్మహత్యే అని డాక్టర్ గుప్తా మాట మార్చారని పేర్కొంది. సుధీర్ గుప్తా యూటర్న్ తీసుకోవడం వెనక మరేమైనా కుట్ర జరుగుతోందా.. అతనిపై ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా అని డౌట్ వ్యక్తపరిచింది. ఒకవేళ ఆధారాలు ధ్వంసమై ఉంటే అది హత్యే అని అప్పుడు చెప్పిన సుధీర్ గుప్తా.. ఇప్పుడు అది ఆత్మహత్యగా చెప్పారనే ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ వెలువరించిన కథనంతో సుశాంత్ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.