లేటు వయసులో ఈ కష్టమేల సుష్?

0

లేటు వయసు ఘాటు సుందరి సుష్మితాసేన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. తనకంటే చాలా చిన్నవాడైన మోడల్ రోహమన్ షాలుని ప్రేమించి సహజీవనం చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. అతడితో సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోల్ని సుష్ నిరంతరం షేర్ చేస్తూనే ఉంది.

తాజాగా సుష్మితా సేన్ ఇన్ స్టా పోస్ట్ అభిమానులకు అదిరిపోయే టార్గెట్ ని సెట చేస్తోంది. గురువారం నాడు తన 45 వ పుట్టినరోజును జరుపుకున్న సుశ్మితా సేన్ ఆల్మోస్ట్ జిమ్నాస్టిక్ ఫీట్ తో అదరగొట్టింది. జిమ్ లో రింగులతో తాను తలకిందులుగా వేలాడుతూ వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆమె వీడియోను పంచుకుని ఇలా వ్యాఖ్యానించింది. సుష్ ఈ కష్టమేల! అంటూ ఆ హార్డ్ జిమ్మింగ్ పై కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే సుశ్మిత మాత్రం ఎంతో సున్నితంగా సమాధానం ఇచ్చింది.

“అబ్బాయిలూ.. మీరు దశాబ్ధంన్నర కాలంగా నాకు గొప్ప భావోద్వేగ శక్తిగా ఉన్నారు. నా కౌంట్ లెక్కిస్తున్నారు … నన్ను తరచూ గుర్తు చేస్తూ.. ఆశీర్వాద జీవితాన్ని ప్రసాదించారు. జీవితం ఎంత గొప్పది.. దాని సామర్థ్యం అంతం లేనిది! నన్ను ఇలానే మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. మీ బేషరతు ప్రేమ దయ నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. మంచి వ్యక్తిగా ఉండటానికి నాకు అవకాశం కల్పిస్తుంది. మంచితనాన్ని వ్యాప్తి చేస్తూ ఉండండి … నాకు ఈ ప్రపంచానికి మీలాంటి వ్యక్తులు కావాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను“ అంటూ ఎంతో ఎమోషన్ అయ్యింది సుష్.

మాజీ అందాల రాణి తన పుట్టినరోజు వేడుకల ఫోటోల్ని షేర్ చేస్తూ…తన దత్తపుత్రికలను తలచుకుంది సుశ్మిత. అలీసా .. రెనీ నా పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం నా వద్దకు వచ్చారని వెల్లడించింది.

సుశ్మితా సేన్ 1994 లో మిస్ యూనివర్స్ కిరీటం పొందారు. 1996 లో వచ్చిన `దస్తక్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బివి నెం 1.. డు నాట్ డిస్టర్బ్… మై హూ నా- మైనే ప్యార్ క్యున్ కియా – తుమ్కో నా భూల్ పాయెంగే – నో ప్రాబ్లమ్ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఇటీవల డిస్నీ + హాట్స్టా ర్లో ప్రసారం అవుతున్న వెబ్-సిరీస్ `ఆర్య`తో కెరీర్ పరంగా రీబూట్ అవుతోంది.