Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘మహా సముద్రం’ నుంచి టాలెంటెడ్ బ్యూటీ ఫస్ట్ లుక్..!

‘మహా సముద్రం’ నుంచి టాలెంటెడ్ బ్యూటీ ఫస్ట్ లుక్..!


Rx 100′ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”మహా సముద్రం”. ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శర్వానంద్ – ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి – గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘మహాసముద్రం’ సినిమాలో ‘మహా’ పాత్రలో అదితి నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అదితి రావు కన్నీళ్లతో తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ భారీ మల్టీస్టారర్ ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19న విడుదల చేయనున్నారు.

ఇకపోతే ‘మహా సముద్రం’ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు.