Templates by BIGtheme NET
Home >> Cinema News >> బన్నీ బావమరిది ‘బతుకు బస్టాండ్’ నుంచి న్యూ పోస్టర్..!

బన్నీ బావమరిది ‘బతుకు బస్టాండ్’ నుంచి న్యూ పోస్టర్..!


మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది తనయుడు విరాన్ ముత్తంశెట్టి ”బతుకు బస్టాండ్” అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో విరాన్ సరసన నిఖిత అరోరా హీరోయిన్ గా నటిస్తోంది. ఐఎన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కె.చక్రధర్ రెడ్డి సమర్పణలో ఇలవల ఫిలిమ్స్ బ్యానర్ పై ఐ.కవితా రెడ్డి – కె.మాధవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించింది. ఇక ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ‘ఐకానిక్ మాస్ స్టార్’ అనే కొత్త ట్యాగ్ ఇస్తూ ఈ సినిమాని వార్తల్లో నిలిపారు.

ఈ క్రమంలో ఉగాది కానుకగా తాజాగా ‘బతుకు బస్టాండ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు విరాన్ – నిఖిత ఒకరికొకరు దగ్గరగా కూర్చొని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. శేఖర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘బతుకు బస్టాండ్’ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు హీరోలుగా పరిచయమైన వారు ప్రేక్షకులను మెప్పించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.