Templates by BIGtheme NET
Home >> Cinema News >> సామ్ జామ్ లో మైండ్ బ్లాక్ చేసిన తమన్నా

సామ్ జామ్ లో మైండ్ బ్లాక్ చేసిన తమన్నా


అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ఓటీటీలతో పోటీపడి ఒక స్థానిక ఓటీటీ నిలబడడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎంతో పెట్టుబడి పెడితే.. ఎంతో సహనంతో దినదినాభివృద్ధికి కృషి చేస్తేనే ఇది సాధ్యం. రిస్క్ అని తెలిసీ కోట్లాది రూపాయలు వెదజల్లే సత్తా కూడా ఉండాలి. ఇవన్నీ చేయడం ద్వారానే అల్లు అరవింద్ ఆహా – తెలుగు ఓటీటీని సక్సెస్ చేయగలిగారు. ఆరంభం ఎన్నో ఒడిదుడుకులు విమర్శల్ని ఎదుర్కొని ఎట్టకేలకు ఈ వేదికను సుస్థిరం చేసుకునే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం ఆహాలో ఒరిజినల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులోనే సామ్ జామ్ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అక్కినేని కోడలు సమంత హోస్టింగ్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్టారాధి స్టార్లు అంతా సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ స్టార్లను సమంత ఇంటర్వ్యూలు చేశారు. నిర్మొహమాటంగా సీక్రెట్స్ బయట పెట్టేందుకు ప్రేరేపించారు.

తాజాగా తమన్నా ఎపిసోడ్ ని అంతే రంజుగా తీర్చిదిద్దారు. ఇక సమంతతో పాటు మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కెమిస్ట్రీ అదిరిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ట్రెండీ లుక్ కూడా అంతే వైరల్ గా చర్చకు వచ్చింది. వైట్ టాప్ పై బ్లాక్ షిమ్మరీ డిజైన్ డ్రెస్ తో తమన్నా ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక గోల్డ్ కలర్ షిమ్మరీ డ్రెస్ లో సమంత ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి కాంబినేషన్ ఫోటో వైరల్ గా మారింది.