‘సిమి’ పాత్రను గౌరవంగా భావిస్తున్నా : తమన్నా

0

మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గింది. యంగ్ స్టార్ హీరోలు దాదాపు అందరితో నటించిన ముద్దుగుమ్మ తమన్నా హీరోయిన్ గా ఆఫర్లు రాని ఈ సమయంలో ఇతర పాత్రలకు కూడా ఓకే చెబుతోంది. పెద్ద సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తన సినీ కెరీర్ కొనసాగించాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అమ్మడు నితిన్ చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమా రీమేక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

జాతీయ అవార్డు దక్కించుకున్న అంధాదున్ సినిమాలో టబు పోషించిన పాత్రను తమన్నా చేయబోతుంది. హీరోకు చాలా క్లోజ్ గా ఉండటంతో పాటు ఎక్కువ కాంబో సీన్స్ ఉండే పాత్ర. నటనకు ప్రాధాన్యత ఉండటంతో పాటు కథలో చాలా కీలకమైన పాత్ర అవ్వడం వల్ల తమన్నా నటించేందుకు ఓకే చెప్పింది. అంధాదున్ లో సిమి సిన్హా పాత్రలో టబు కనిపించింది. ఇప్పుడు ఆ సిమి పాత్రను తెలుగు ప్రేక్షకుల ముందుకు తమన్నా తీసుకు రాబోతుంది. టబు గారు చేసిన సిమి పాత్ర నాకు రావడం గౌరవంగా భావిస్తున్నాను అంది.

ప్రస్తుతం అంధాదున్ రీమేక్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులను ఎప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు ఎదురు చూస్తూ ఉంటాను అంటూ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఈమద్య కాలంలో కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటీటీ కోసం కూడా ఈమె టైం కేటాయిస్తుంది. ఇప్పటికే ఆహా కోసం ఒక టాక్ షో ను ఈమె నిర్వహిస్తుందట. త్వరలోనే అది స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ తర్వాత ఈమె ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అది కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.