విమానమెక్కిన డాంగ్ డాంగ్ బ్యూటీ

0

మిల్కీ బ్యూటీ తమన్నా ముంబై టు హైదరాబాద్ జర్నీ కంటిన్యూ అవుతోంది. మళ్లీ హల్ చల్ మొదలెట్టింది. `బాహుబలి`లో అవంతికగా మెరిసిన తమన్నా ఆ తరువాత ఆ స్థాయి పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాల్ని దక్కించుకోలేక పోతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఐటమ్ నెంబర్ లు తప్ప కీలక పాత్రల్ని.. హీరోయిన్ ఆఫర్లని సొంతం చేసుకోలేకపోతోంది. జస్ట్ ఐటెమ్ ఎనఫ్ అన్నట్టుగానే.. ఎన్టీఆర్ నటించిన `జై లవ కుశ`లో `స్వింగు జరా..` అంటూ హీటెక్కించింది.

ఆ తరువాత `కేజీఎఫ్` చిత్రంలో `దోచెయ్…` సాంగ్… అటుపైనా `సరిలేరు నీకెవ్వరు`లో `డాంగ్ డాంగ్..` అంటూ చిందేసి సరిపెట్టుకుంది. కానీ క్రేజీ స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ ని మాత్రం పొందలేకపోతోంది. కెరీర్ పరంగా కొంత డల్ ఫేజ్ ని ఫేస్ చేస్తున్న తమన్నా మళ్లీ స్పీడు పెంచినట్టే కనిపిస్తోంది. తాజాగా గోపీచంద్ తో `సీటీమార్`లోనూ తాజాగా యంగ్ హీరో నితిన్ తో `అంధాధూన్` రీమేక్ లోనూ నటిస్తోంది.

`అంధాధూన్` రీమేక్ లో టబు పాత్రలో తమన్నా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర మిల్క్ బ్యూటీకి ఓ ఛాలెంజ్ అని చెబుతున్నారు. ఇదిలా వుంటే తాజాగా తమన్నా ఏయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసింది. వైట్ కలర్ లాంగ్ స్లీవ్ టాప్ పైన యాష్ కలర్ టీషర్ట్.. బ్లూ జీన్స్.. ముఖానికి మాస్క్ ధరించి సూపర్ కూల్ లుక్ లో కిర్రాక్ గా కనిపిస్తోంది. తెలుగు సినిమాల షూటింగ్ కోసం తమన్నా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.