మహేష్ అయితేనే మురుగదాస్ కి కరెక్ట్ అంటూ ఓటింగ్!

0

సౌత్ స్టార్ డైరెక్టర్లలో జాతీయ అవార్డులతో సంచలనాలు సృష్టించిన ప్రతిభావంతుడైన ఏ.ఆర్. మురుగదాస్ అడుగు పెట్టిన ప్రతిచోటా విజయాలు అందుకున్నారు. హిందీ పరిశ్రమలోనూ ఆయనకంటూ ఓ రెస్పెక్ట్ ఉంది. సెప్టెంబర్ 25న ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతిసారి బర్త్ డే వేరు.. ఈసారి వేరు. ఎందుకంటే ఆయన కోసం ఫ్యాన్స్ ఓ స్పెషల్ ప్లాన్ చేశారు.

నిన్న ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్ చెప్పిన ఆయన అభిమానులు ఆసక్తికరమైన ఒక విషయాన్ని చర్చకు తెచ్చారు. మురుగదాస్ మళ్ళీ ఏ స్టార్ హీరోతో వర్క్ చేస్తే బాగుంటుందనేదే ఆ చర్చ. ఈ చర్చలో భాగంగా అనేక మంది ఆన్ లైన్ పోల్స్ నిర్వహించి అందులో చిరంజీవి- అమీర్ ఖాన్- అక్షయ్ కుమార్- మహేష్ బాబుల పేర్లు ఉంచగా ఎక్కువమంది మహేష్ తోనే మురుగదాస్ మరోసారి వర్క్ చేస్తే బాగుంటుందని ఓట్లు వేశారు.

2017లో మహేష్ బాబు మురుగదాస్ కలిసి ‘స్పైడర్’ సినిమా చేశారు. భారీ హైప్ నడుమ తెలుగు- తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో మహేష్ మాత్రమే కాదు ఆయన అభిమానులంతా తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. అయినా వారు మళ్ళీ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మరో సినిమా చేయాలని చేస్తే బాగుంటుందని కోరుకోవడం విశేషం. మురుగదాస్ కు సైతం మహేష్ అంటే చాలా అభిమానం. ‘స్పైడర్’ సినిమా పరాజయం పొందినా కూడ మురుగదాస్ ఇప్పటికీ తన ట్విట్టర్ ఆకౌంట్ కవర్ పిక్ గా ‘స్పైడర్’లోని మహేష్ స్టిల్ ను పెట్టుకుని ఉంటారు. అంత అభిమానం ఉన్న మురుగదాస్ మహేష్ మళ్లీ ఛాన్స్ ఇస్తే సినిమా చేయకుండా ఉంటారా.

దీన- రమణ- గజినీ- స్టాలిన్- తుపాకి- కత్తి- సర్కార్ ఇలా ప్రతిదీ భారీ యాక్షన్ ఎంటెర్టైనర్లు రూపొందించిన మురుగ విజయ్ కాంత్- రజనీకాంత్- విజయ్- మెగాస్టార్ చిరంజీవి- అమీర్ ఖాన్- అక్షయ్ కుమార్- మహేష్ బాబు- సూర్య లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఉంది మురుగదాస్ కు.