మొన్న విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సూర్య ఫ్యాన్స్

0

తమిళ సినీ ప్రముఖులకు రాజకీయాలతో దగ్గర సంబంధాలు ఉంటాయి. కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే మరి కొందరు సినిమా పరిశ్రమలోనే ఉండి రాజకీయాల్లో తమకు నచ్చిన వారికి మద్దతు ఇస్తూ ఉంటారు. తమిళనాట ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇప్పుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్నాడు.. త్వరలో రజినీకాంత్ కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయ్యింది. ఇక వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు.

గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో విజయ్ ను రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు మరియు కొందరు సినీ ప్రముఖులు కూడా కోరుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన పోస్టర్ లను రాజకీయాల్లోకి రావాలంటూ ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తమిళ మరో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి రావాలంటూ కోరుకుంటూ ఆయన అభిమానులు పోస్టర్ లు అంటిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ జరుగుతోంది. సమాజం పట్ల శ్రద్ద ఉ్న సూర్య వంటి వారు రాజకీయాల్లోకి రావడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం అంటూ సూర్య అభిమానులు కోరుకుంటున్నారు.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండే సూర్య రాజకీయాల్లో ఉంటే మరింతగా సేవ చేసే అవకాశం ఉంటుందని అందుకే వచ్చ ఎన్నికల సమయం వరకు ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాని సూర్యకు మాత్రం రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి అస్సలు ఉన్నట్లుగా అనిపించడం లేదు. భవిష్య్తులో ఏమో కాని ఇప్పుడు మాత్రం ఆయన మొత్తం దృష్టి సినిమాలపైనే ఉండబోతుంది.