తమిళ ‘రామలక్ష్మి’ కన్ఫర్మ్

0

రామ్ చరణ్ సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంను తమిళంలో రీమేక్ చేయబోతున్నారంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. తమిళంలో ఈ సినిమాను లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడు. రామ్ చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ పోషించబోతున్నాడట. అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాకున్నా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకార ప్రాజెక్ట్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. చరణ్ పాత్రను లారెన్స్ పోషించనుండగా సమంత పోషించిన పాత్రను నిక్కీ గర్లానీతో చేయించబోతున్నారు.

రంగస్థలం చిత్రంలో సమంత పాత్ర హైలైట్ గా ఉంటుంది. పల్లెటూరు అమ్మాయిగా గడుసు పిల్ల రామలక్ష్మి పాత్రను సమంత అద్బుతంగా పోషించింది. అందుకే తమిళంలో రామలక్ష్మి పాత్రను పోషించేది ఎవరో అని అంతా అనుకున్నారు. తాజాగా నిక్కి గర్లానీ ఆ పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆమెను కన్ఫర్మ్ చేశారట. కుమార్ బాబు పాత్రను తెలుగులో ఆది పినిశెట్టి పోషించాడు. తమిళంలో కూడా ఆయనే చేసే అవకాశం ఉందంటున్నారు. ఆదికి స్నేహితురాలు అవ్వడం వల్లే నిక్కీ గర్లానికి ఈ చిత్రంలో ఛాన్స్ వచ్చిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో వైపు ఈ సినిమాను లారెన్స్ రీమేక్ చేయడంను కొందరు మెగా ఫ్యాన్స్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమిళంలో స్టార్ హీరో రంగస్థలం చిత్రంను చేస్తే కాస్త మర్యాదగా ఉంటుందేమో కదా అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఎవరు చేసినా కూడా రంగస్థలం చిత్రం మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా హిట్ అయ్యి చరణ్ కు కూడా మళ్లీ అక్కడ పేరు వస్తుందనే నమ్మకంను కొందరు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.