Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఉగ్రవాద రైతులు వర్సెస్ క్వీన్ ఎపిసోడ్.. కర్ణాటకలో క్రిమినల్ కేసు

ఉగ్రవాద రైతులు వర్సెస్ క్వీన్ ఎపిసోడ్.. కర్ణాటకలో క్రిమినల్ కేసు


వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. దీనిలో ఆమె నిరసనకారులను `ఉగ్రవాదులు` అంటూ అభివర్ణించింది.

కంగనా రనౌత్ సెప్టెంబర్ 20 న పోస్ట్ చేసిన ట్వీట్ పై ఎన్ని సెక్షన్లు వేసారంటే…? ఐపిసి సెక్షన్ 44.. 108.. 153.. 153 ఎ మరియు 504 కింద కేసు నమోదైంది. వ్యవసాయ బిల్లులు.. ఎంఎస్.పి పాలన చుట్టూ ఉన్న సందేహాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ పై కంగనా రనౌత్ ఇలా అన్నారు. “ఎవరైనా నిద్రపోతే వారిని మేల్కొనేలా మన ప్రధాని చేయవచ్చు.. ఎవరికైనా అర్థం కాకపోతే వాటిని వివరించవచ్చు . కానీ ఎవరైనా నిద్రపోతున్నట్టు నటించినా లేదా అర్థం చేసుకోవాలనుకోనప్పుడు ఏమి చేయగలరు ఎవరైనా? వీరు(రైతులు) అదే తరహా ఉగ్రవాదులు. CAA కారణంగా ఒక పౌరుడిని కూడా కోల్పోలేదు. కాని వారు చాలా రక్తం చిందించారు“ అని కంగన సుదీర్ఘంగానే వ్యాఖ్యానించింది.

కంగనా రనౌత్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రతిపక్ష నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఒక్కసారిగా భగ్గుమన్నారంతా. 2019 ముగింపులో దేశాన్ని కదిలించిన CAA వ్యతిరేక నిరసనలకు ముడివేసి రైతుల అంశాన్ని ప్రస్థావించడంతో అది కాస్తా చిర్రెత్తిపోయేలా చేసింది. ఇక అధికార భాజపా ఎన్డీయేకి కంగన వత్తాసు పలకడంపైనా చాలామంది సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అటు ముంబైలో కంగన కార్యాలయం కూల్చివేతకు కారణమైన మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన వ్యతిరేకంగా వెళుతోంది. ప్రస్తుతం ఆ కూల్చివేత వ్యవహారంపై కోర్టులో విచారణ సాగుతోంది.