బిగ్ బాస్ కోసం ముద్దమందారం బ్యూటీ క్వారెంటైన్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంపిక అయిన కంటెస్టెంట్స్ ను మెడికల్ టెస్ట్ లకు పంపించడం ఆపై కరోనా కారణంగా క్వారెంటైన్ కు పంపడం జరిగింది. మొత్తం 16 మంది వరకు షో కోసం ఎంపిక అయ్యారు. వారు అంతా కూడా క్వారెంటైన్ కు వెళ్లారు. అందులో ముద్ద మందారం సీరియల్ లో పార్వతి పాత్రలో నటించిన తనూజ గౌడ కూడా క్వారెంటైన్ కు వెళ్లినట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

తెలుగు అమ్మాయి కాకున్నా కూడా ఈమె పార్వతి పాత్రలో ఈమె నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అందుకే ఈమెను తీసుకోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించవచ్చు అంటూ స్టార్ మా మరియు షో నిర్వాహకుల ప్లాన్ గా తెలుస్తోంది. బుల్లి తెరకు చెందిన పలువురు స్టార్స్ మరియు యూట్యూబ్ స్టార్స్ పై ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సినిమాలకు చెందిన వారు ఈసారి కాస్త తక్కువగా కనిపిస్తారని అంటున్నారు. జెమిని కామెడీ యాంకర్ అరియానా మరియు గంగవ్వలతో పాటు మరికొందరు ఈసారి షో పై చాలా ఆసక్తిని పెంచుతున్నారు.

షో నిర్వాహకులు అన్ని రెడీ చేసి ఈనెల 30 నుండి షో ను షురూ చేయాలనుకున్నారు. అయితే కంటెస్టెంట్స్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో మరో వారం రోజలు ఆలస్యంగా షో ను ప్రారంభించాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో షో కు సంబంధించిన డేట్ ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.