నాకైతే అమ్మ ఆ విషయం చెప్పలేదు

0

తెలుగు వెండి తెరపై ఆంటీగా అమ్మగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి బిగ్ బాస్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో కూతురు సుప్రితతో కలిసి ఈమె చేస్తున్న హడావుడి బిగ్ బాస్ ఎంట్రీ కోసం అనే వారు చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో సురేఖ వాణి షో నిర్వాహకులు ఉంచిన క్వారెంటైన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై ఆమె కూతురును ప్రశ్నించగా ఆసక్తికర సమాదానం చెప్పింది. ఆమె మాటను ఒకొక్కరు ఒక్కో విధంగా అన్వయించుకుంటున్నారు.

సుప్రిత తన పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా లైవ్ కు వచ్చింది. లైవ్ చాట్ లో పలు విషయాలపై ఆమె స్పందించింది. భవిష్యత్తు లో పెళ్లి నుండి సినిమాలో నటించే విషయం వరకు అన్ని విషయాల్లో ఆమె మాట్లాడటం జరిగింది. ఇదే చాట్ లో అమ్మ సురేఖ వాణి బిగ్ బాస్ ఎంట్రీ గురించి చాలా మంది ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె సమాధానం ఇస్తూ… అమ్మ నాకు ఆ విషయం ఏమీ చెప్పలేదు. మీకు ఏమైనా చెప్పిందా అంటూ రివర్స్ ఫన్నీగా ప్రశ్నించింది.

సురేఖ బిగ్ బాస్ ఎంట్రీ విషయంను కుటుంబ సభ్యులు ఎవరు కూడా రివీల్ చేయకూడదు. అందుకే ఆమె కూతురు ఈ విషయంలో నాకు ఎలాంటి సమాచారం లేదు అంటోంది. ఒక వేళ సురేఖ బిగ్ బాస్ ఎంట్రీ నిజంగా ఇవ్వకుంటే ఖచ్చితంగా సుప్రిత ఆ విషయన్ని క్లారిటీ వచ్చేది. అమ్మ షో కు వెళ్లడం లేదని సుప్రిత చెప్పకుండా నాకు తెలియదు అంటూ ఇండైరెక్ట్ గా ఆమె చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా సురేఖ వాణి త్వరలో ప్రారంభం కాబోతున్న షో లో ఉంటుందనే నమ్మకంగా చెబుతున్నారు.