ఎంతగా ఆరోపిస్తే అంతగా షైన్ అవుతోంది!

0

ఎంతగా ఆరోపణలు వస్తే అంతగా చెలరేగుతోంది రకుల్. రెబల్ లా మారుతోంది. ఆరోపిస్తే నాకేంటి? అన్నట్టుగానే ఉంది వ్యవహారం. ఇటీవల వరుస ఫోటోషూట్లతో తనలోని రెబల్ ని బయటకు తెస్తోంది. మొన్నటికి మొన్న డ్రగ్స్ లో తన పేరును ఇరికించిన మీడియాపై కోర్టుకెళ్లింది. ఆ రకంగానూ తాను ఎంత రెబల్ ఏంటో చూపించింది.

అదంతా అటుంచితే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సరసన నాయికగా ఆడిపాడుతోంది. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ మూవీ వికారాబాద్ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. ఓవైపు షూటింగుల బిజీలో ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ గా ఉంది అమ్మడు.

తాజాగా ఎల్లే కలర్ స్వెట్ షర్ట్ లో ప్రత్యక్షమై హీట్ పెంచింది. అసలే థై షోస్ కి ఏమాత్రం మొహమాటపడని రకుల్ ఆ యాంగిల్ లోనూ రెబలిజం చూపించింది. ఎంతగా ఆరోపిస్తే అంతగా షైన్ అవుతానని ఈ లుక్ తో చెప్పకనే చెప్పింది. సంథింగ్ హాట్ గా ఉన్న ఈ ఫోటో యువతరంలో జోరుగా వైరల్ అయిపోతోంది. మరోవైపు హిందీ పరిశ్రమలోనూ రకుల్ స్క్రిప్టులు విని ఓకే చెబుతోందని తెలుస్తోంది.