ప్రభాస్ ‘సాహో’ను మించిన ఆర్ఎక్స్ 100 హీరో మూవీ

0

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా నిరాశ పర్చింది. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో రూపొందిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం సాహోను అస్సలు పట్టించుకోలేదు. సాహో సినిమా వసూళ్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకు భారీగా నష్టాలను మిగిల్చింది. యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా ఉత్తరాదిన టాప్ చిత్రాల జాబితాలో నిలిచే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరోసారి పేలవ ప్రదర్శణ ఇచ్చింది. సినిమా విడుదల చాలా రోజులు అయ్యింది. కొన్ని కారణాల వల్ల బుల్లి తెరపై ప్రదర్శించలేదు. ఎట్టకేలకు జీ తెలుగులో లో ఈ సినిమా ప్రసారం అయ్యింది.

భారీ రేటింగ్ ను ఛానల్ యాజమాన్యం ఆశించింది. భారీగా పబ్లిసిటీ చేయడంతో పాటు మంచి టైం చూసి ప్రసారం చేశారు. అయినా కూడా సాహో కు దక్కిన టీఆర్పీ రేటింగ్ 5.8 మాత్రమే. హిందీ వర్షన్ ప్రసారం అయిన సమయంలో రికార్డు స్థాయి రేటింగ్ దక్కించుకుంది. రీ టెలికాస్ట్ సమయంలో కూడా అదిరిపోయే రేటింగ్ ను దక్కించుకున్న సాహో సినిమా తెలుగు వర్షన్ మాత్రం పరువు పోగొట్టుకునే రేటింగ్ ను పొందింది. ఈ సినిమా ప్రసారం అయిన సమయంలో ఈటీవీలో ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ సినిమా కూడా ప్రసారం అయ్యింది. ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే సాహో కు 5.8 రేటింగ్ రాగా గుణ 369 సినిమాకు 5.9 రేటింగ్ వచ్చింది.

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఇబ్బందిని కలిగిస్తున్న విషయం. సాహో సినిమా ఒక తెలుగు సినిమా మాదిరిగా కాకుండా ఓవర్ గా యాక్షన్ ఎపిసోడ్ లు ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవ్వలేరు. అందుకే ఈ సినిమాకు ఎక్కువగా రేటింగ్ రాలేదు అనేది కొందరి వాదన. సాహోకు రేటింగ్ రానంత మాత్రాన ప్రభాస్ స్టార్ డం లేదని కాదు కాని సాహో సినిమా ఫలితం అలాంటిది. ప్రస్తుతం ఆయన చేస్తున్న మరియు చేయబోతున్న సినిమాలు వసూళ్లతో పాటు టీఆర్పీ రేటింగ్ విషయంలో కూడా రికార్డ్ లు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.