ఇటాలియన్ మీడియాలో స్టైలిష్ ప్రభాస్ పై కథనం

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్న విషయం తెల్సిందే. గత రెండు మూడు వారాలుగా అక్కడ షూటింగ్ జరుపుతున్న ప్రభాస్ అండ్ టీం మరి కొన్ని రోజుల్లో అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకబోతుంది. 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇటలీలో ప్రత్యేకంగా కార్లను మరియు అప్పటి పరిస్థితులను క్రియేట్ చేశారు. దాంతో స్థానికులు కూడా షూటింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు. సాదారణంగా షూటింగ్ చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని అప్పటి బ్యాక్ డ్రాప్ తో విభిన్నమైన లుక్స్ తో తమ పాత రోజులను రాధేశ్యామ్ టీం గుర్తు చేస్తున్న కారణంగా అంతా కూడా ఈ సినిమా షూటింగ్ గురించి అక్కడ చర్చించుకుంటున్నారు.

జనాలు చర్చించుకోవడం మాత్రమే కాకుండా ఒకటి రెండు ఇటాలియన్ మీడియా సంస్థలు కూడా రాధేశ్యామ్ షూటింగ్ గురించి కథనాలు వేయడం జరిగింది. ప్రభాస్ స్టైలిష్ లుక్ ను మరియు చిత్ర యూనిట్ సభ్యుల కాస్ట్యూమ్స్ పై కథనాలు రాస్తున్నారు. ప్రభాస్ ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాధేశ్యామ్ షూటింగ్ ఎక్కువ శాతం యూరప్ లో జరిగింది. కథ మొత్తం కూడా అక్కడే జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ ను అక్కడ కూడా విడుదల చేసే అవకాశం ఉందా అనిపిస్తుంది. యూరప్ దేశాల్లో ముఖ్యంగా ఇటలీలో రాధేశ్యామ్ పై ప్రత్యేకమైన శ్రదను కనబర్చుతున్నారు. అందుకే మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ టైమ్ తర్వాత షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఇదే అవ్వడం వల్ల కూడా ఇటలీ మీడియా ఈ సినిమాపై కథనాలు ఇస్తుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.