‘పలాస 1978’ దర్శకుడితో సినిమా అనౌన్స్ చేసిన సుధీర్ బాబు…!

0

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన చిత్రాలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ‘భలే మంచి రోజు’ ‘భాగీ’ ‘శమంతకమణి’ ‘సమ్మోహనం’ ‘వి’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు సుధీర్ బాబు. ‘పలాస 1978’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సినీ ప్రముఖుల ప్రసంశలు అందుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ప్రీ లుక్ పోస్టర్ లో ఓ కరెంట్ స్తంభం పక్కన టేబుల్ పై గోళీసోడాలు – మల్లెపూలు – లైటింగ్ – కరెంట్ వైర్లు మరియు స్క్రూ డ్రైవర్ కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్ తోనే మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు ‘పలాస’ డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. సుధీర్ బాబు తన తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ చిల్లా నిర్మాణంలో ఇంతకముందు ‘భలే మంచి రోజు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ సినిమాల తర్వాత ప్రొడక్షన్ నెం.4 గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. షందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రేపు(అక్టోబర్ 30) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.