మణిరత్నం ‘నవరస’కు మీటూ విమర్శలు

0

తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్ కు మీటూ సెగ తగిలింది. తమిళ గాయకురాలు డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి మణిరత్నం పై విమర్శలు చేసింది. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మీ నవరసలో అవకాశం ఇచ్చారు. నన్ను మాత్రం నిషేదించారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. కొన్నాళ్ల క్రితం మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న సింగర్ కార్తీక్ ను ఈ వెబ్ సిరీస్ కోసం మణిరత్నం తీసుకోవడంపై చిన్మయి ఈ ఆరోపణలు చేసింది.

మణిరత్నం మరియు జయేంద్రలు నిర్మిస్తున్న ఈ 9 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ కు 9 మంది దర్శకత్వం వహించబోతున్నారు. 9 మంది సినిమాటోగ్రాఫర్స్ మరియు 8 మంది సంగీత దర్శకులు 20 మంది ముఖ్యమైన నటీనటులు నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. 9 ఎపిసోడ్ లు 9 విభిన్నమైన కథలతో రూపొందబోతున్నాయి. ఈ అతి పెద్ద ప్రయోగంలో సింగర్ కార్తిక్ భాగస్వామ్యం అవ్వడంతో చిన్మయి కామెంట్ చేసింది. మీటూ ఆరోపణలు చేసిన నన్ను బహిష్కరించి వేదింపులకు పాల్పడిన వ్యక్తికి మీరు పని ఇస్తున్నారు అంటూ మణిరత్నంను టార్గెట్ చేసి చిన్మయి చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.

ఈ ప్రాజెక్ట్ లో కార్తిక్ ను ఎంపిక చేయడం పై చిన్మయి మాత్రమే కాకుండా పలువురు విమర్శలు చేస్తున్నాడు. మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న అతడు ఆ విషయం నిజమే అన్నట్లుగా ఒకానొక సందర్బంగా ఒప్పుకున్నాడు. ఆ కారణంగానే తన కుటుంబ జీవితం మరియు కెరీర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. అలాంటి వ్యక్తికి ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటీ అంటూ మణిరత్నంను పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు.