Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెపోటిజం వ్యతిరేక ముఠాకు జాన్వీ కౌంటర్ ఇదే

నెపోటిజం వ్యతిరేక ముఠాకు జాన్వీ కౌంటర్ ఇదే


This is Janvi counter to the anti Nepotism gang

This is Janvi counter to the anti Nepotism gang

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామాలు తెలిసినదే. నటవారసులకు అతి పెద్ద ముప్పు తలెత్తింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై సుశాంత్ అభిమానులు.. నెటిజనులు నటవారసత్వం (నెపోటిజం)ను తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఇందులో శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. భట్స్ .. చోప్రాలు.. కపూర్ లు ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండగా.. కపూర్లకు ఈ సెగ అంతే తీవ్రంగా ఉంది. సోనమ్ కపూర్ తో పాటు జాన్వీని తీవ్ర పదజాలంతో సుశాంత్ అభిమానులు కామెంట్లు చేశారు.

అయితే దీనికి ఇదే నా సమాధానం అన్న తీరుగా జాన్వీ తనదైన నటనతో సమాధానమిస్తోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన `కార్గిల్ గర్ల్` విశేష ఆదరణ పొందుతోంది. వైమానిక దళ అధికారిణి గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ అద్భుత నటనతో ఆకట్టుకుంది. గుంజన్ సక్సేనా పాత్రకు న్యాయం చేయడం ద్వారా విమర్శకులకు జన్వీ ధీటైన సమాధానం ఇచ్చింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ విషయమై జాన్వీ ఎంతో ఆసక్తిని కనబరిచిన సంగతి విధితమే.

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ధడక్ తో జాన్వీ కెరీర్ మొదలైంది. రెండో చిత్రంగా విడుదలైన గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ కూడా ఇదే బ్యానర్ నిర్మించింది. ఆమె కరణ్ తదుపరి దర్శకత్వం వహించిన తఖ్త్ సహా మరొక ధర్మ చిత్రం – దోస్తానా 2 కు సంతకం చేసింది.