Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్మ ‘కామన్ సెన్స్’ పై శివ నాగేశ్వరరావు

వర్మ ‘కామన్ సెన్స్’ పై శివ నాగేశ్వరరావు


Siva Nageswara Rao Talking About Ram Gopal Varma

Siva Nageswara Rao Talking About Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒకటి రెండు సినిమాలకు అసోసియేట్ గా పని చేసి శివ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. వర్మ కెరీర్ ఆరంభం నుండి ఆయన్ను శివ నాగేశ్వరరావు ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇద్దరు కూడా ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. కనుక ఆ అనుభవాలను ఈమద్య శివ నాగేశ్వరరావు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇటీవలే వర్మ గురించి ఒక విషయాన్ని షేర్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మరోసారి కామన్ సెన్స్ అనే టాపిక్ తో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

మద్రాస్ పామ్ గ్రోవ్ హోటల్ లో రూమ్ నెం. 305 లో ఉన్న వ్యక్తిని కలిసేందుకు వెళ్లమంటూ తరణి గారు పంపించడంతో వెళ్లాను. కాలింగ్ బెల్ కొట్టగానే తెల్ల పైజామా ధరించిన వ్యక్తి డోర్ తీశాడు. నన్ను దర్శకుడు రమ్మన్నారు అంటూ పరిచయం చేసుకోవడంతో ఆయన లోనికి రమన్నాడు. అయిదు నిమిషాలు వెయిట్ చేయండి అంటూ లోనికి వెళ్లారు. ప్రొడ్యూసర్ క్యాండిడేట్ మనకు పెద్దగా అవసరం రాకపోవచ్చు ఇంగ్లీష్ మీడియం అంటూ తరణి గారు చెప్పిన విషయాలు నా మనసులో మెదులుతున్నాయి. ఇంతలో ఆయన వచ్చి నా పేరు రాము అంటూ పరిచయం చేసుకున్నారు. ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేశాం. పక్క రూమ్ లో నుండి మల్లాది గారు కూడా వచ్చారు. తర్వాత తరణి గారు కూడా రావడంతో కథ చర్చలు మొదలు పెట్టాం. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ మరియు బిల్ కాస్ బి ల నుండి కొన్ని సీన్స్ ఆధారంగా తీసుకుని కథను రూపొందించడం జరిగింది.

రాము నేను ఎక్కువ సమయం మాట్లాడుకోవడంతో నాకు సినిమా మేకింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఉందని ఆయన నమ్మాడు ఆయన సినిమాలపై ఖచ్చితమైన అభిప్రాయం ఉందని నాకు అనిపించింది. ఒక సారి రాము నన్ను దర్శకుడు కావాలంటే మొదటి క్వాలిఫికేషన్ ఏంటీ అంటూ నన్ను అడిగారు. అప్పుడు కామన్ సెన్స్ అంటూ సమాధానం చెప్పాను. అది అతడికి పుష్కలంగా ఉంది. కనుక దర్శకుడు అయ్యాడు అంటూ సరదాగా శివనాగేశ్వరరావు కామెంట్ చేశారు.