Templates by BIGtheme NET
Home >> Cinema News >> జగన్ కు సూచన: స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై హీరో రామ్ సంచలన ట్వీట్స్

జగన్ కు సూచన: స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై హీరో రామ్ సంచలన ట్వీట్స్


తప్పు ఎవరిది అయితేనేం.. కరోనా చికిత్స కోసం వచ్చిన 12మంది అమయాకుల ప్రాణాలు విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నికి ఆహుతయ్యాయి. ఇదిప్పుడు రాజకీయ రూపు సంతరించుకుంది. తప్పు మీదంటే మీదని అందరూ నెపాన్ని తప్పించుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంతకీ తప్పు ఆస్పత్రి నిర్వహించిన ‘రమేశ్ ఆసుపత్రిదా.?’ లేక ఆసుపత్రికి అనుమతిచ్చినా ప్రభుత్వ అధికారులదా? నిర్వహించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ ది తప్ప అన్న విషయంలో ఎవరికి మద్దతుగా వారు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఎంట్రీ ఇచ్చాడు. సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర జరుగుతోందంటూ విన్నవించాడు.

హీరో రామ్ ట్వీట్ చేస్తూ.. ‘హోటల్ స్వర్ణ ప్యాలెస్ ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చకముందు ప్రభుత్వం అక్కడే క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు’ అని ఈ హీరో ప్రశ్నించారు.

ఇక మరో ట్వీట్ లో ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజుల వైపు మళ్లిస్తున్నారు’ అంటూ రమేశ్ ఆసుపత్రిపై విమర్శిస్తున్న వారికి కౌంటర్ గా హీరో రామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక మేనేజ్ మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని ట్విట్టర్ లో ఆ బిల్స్ ను హీరో రామ్ పోస్ట్ చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది సీఎం జగన్ గారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా మీ మీద నమ్మకాన్ని పెట్టుకున్న వారికి డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ల మీద ఓ లుక్కేయండి అంటూ రామ్ ట్విట్టర్ లో జగన్ కు విజ్ఞప్తి చేశారు.

అయితే హీరో రామ్ ది కూడా విజయవాడే. ఆయనకు రమేశ్ ఆస్పత్రి నిర్వాహకులు బంధువులు అని ప్రచారం సాగుతోంది. ఆయన 2014లో రమేశ్ ఆస్పత్రి గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఈ క్రమంలోనే స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో ఒక్క రమేశ్ ఆసుపత్రినే తప్పుపట్టడాన్ని హీరో రామ్ జీర్ణించుకోలేక ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో అందరి తప్పు ఉంది. స్వర్ణ ప్యాలెస్ లో ఆసుపత్రి నిర్వహించిన రమేశ్ ఆసుపత్రికి.. జాగ్రత్తలు తీసుకోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిర్వాహకులకు.. ఈ ఆసుపత్రికి పర్మిషన్ ఇచ్చిన ఫైర్ డిపార్ట్ మెంట్ కి.. హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చినందుకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్ ఇతర అధికారులకు కూడా ఇందులో తప్పు ఉంది. సో అందరి తప్పు ఉంది. ఇందులో ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు. ఇది ఆస్పత్రి కాకముందే ప్రభుత్వమే క్వారంటైన్ సెంటర్ నడిపింది. దీంతో ఒక్కరిపై నెపాన్ని నెట్టవద్దన్న హీరో రామ్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.