లిక్కర్ ని ప్రమోట్ చేస్తున్న ముద్దుగుమ్మలు…!

0

సినీ సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఆన్లైన్ జూదాలను ఎంకరేజ్ చేసే యాప్స్ ని ప్రమోట్ చేస్తూ.. లిక్కర్ బ్రాండ్స్ కి ప్రచారం చేస్తూ నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతుంటారు. ఇటీవల పలువురు హీరోయిన్లు హీరోలు ఆల్కాహాల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా హీరోయిన్ రాధికా ఆప్టే కూడా లిక్కర్ ని ప్రచారం చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. పిక్నిక్ కి వచ్చానని.. అక్కడ వాతావరణానికి తగ్గట్టు పెగ్గు కలిపానని చెప్తూ ఓ ఫోటో షేర్ చేసింది. 50 ఎంఎల్ విస్కీలో 120 ఎంఎల్ సోడా కలిపానని.. దోసకాయ ముక్కల్ని స్టఫ్ గా పెట్టుకున్నానని పేర్కొంది. ఇలా మందులో ఎంత సోడా కలిపింది.. స్టఫ్ ఏం తీసుకుందో కూడా వివరిస్తూ ఆ లిక్కర్ బ్రాండ్ కి బాగానే పబ్లిసిటీ చేసింది. .

ఇంతకముందు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా లిక్కర్ ని ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తన తండ్రి పెగ్ గ్లాస్ పట్టుకొని ఉండగా.. ఆయనికి వవ బుట్టబొమ్మ స్టఫ్ రెడీ చేసి పెట్టినట్లు ఫోజ్ ఇచ్చింది. పూజా తన తండ్రితో కలిసి లిక్కర్ కి ప్రమోట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రాధికా మదన్ – ఈషా గుప్తా వంటి హీరోయిన్స్ కూడా ఇన్స్టా లో ఆల్కాహాల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ పోస్టులు పెట్టారు. హీరోలలో సుధీర్ బాబు – నవదీప్ వంటి వారు మద్యానికి సంబంధించిన బ్రాండ్స్ కి ప్రమోషన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్ట్ గా ఇలాంటి వాటికి ప్రచారం చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని.. ఇలా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సెలబ్రిటీలు ఇలా లిక్కర్ ని తీసుకొని మనుషుల ఆరోగ్యాలను పాడు చేసుకోమని ప్రచారం చేస్తున్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ ఆల్కాహాల్ ని ప్రమోట్ చేయడం ఏమీ బాగాలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇండియాలో మద్యాన్ని నిషేధించలేదు కదా.. ప్రమోట్ చేస్తే తప్పేంటి అని వారికి మద్దతుగా నిలుస్తున్నారు.