బాలీవుడ్ ప్రముఖుల పాపులర్ బంగ్లాలు ఏవి.. ఎక్కడ?

0

బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన అత్యంత పాపులర్ బంగ్లాలు ఏవి?. బాలీవుడ్ దర్శక నిర్మాతలు నటులు సిబ్బంది చాలా మంది నివసించే ముంబై లో ఖరీదైన భవంతుల్ని ఎప్పుడైనా చూశారా? మీరు ఎప్పుడూ విజిట్ చేయని నగరంలో అత్యంత ప్రసిద్ధ చెందిన బాలీవుడ్ ఫేమస్ స్టార్ల గృహాలను చూడాలనుకుంటే ఇవిగో.. ఇక్కడ పర్యటించాలి.

బాంద్రా బ్యాండ్ స్టాండ్ లోని షారూఖ్ ఖాన్ ఐకానిక్ హెరిటేజ్ బంగ్లా `మన్నత్` నిస్సందేహంగా దేశంలోని ప్రసిద్ధ బాలీవుడ్ గృహాలలో ఒకటి. బాలీవుడ్ రాజుగా పిలవబడే ఖాన్ 2001లో బాయి ఖోర్షెద్ భాను సంజన ట్రస్ట్ నుండి హెరిటేజ్ భవనాన్ని కొనుగోలు చేసి దానికి `మన్నత్` అని పేరు పెట్టారు. మన్నత్ అంటే ‘దేవుని ప్రతిజ్ఞ’ అని అర్థం. తరువాత ఇదే బంగ్లా వెనుక ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు.

మీరు బాలీవుడ్ సంగీతానికి అభిమాని అయితే.. బాంద్రాలోని రఫీ మాన్షన్ మీ ముంబై పర్యటన ముఖ్యాంశాలలో ఒకటి కానుంది. బాలీవుడ్ అత్యంత గౌరవనీయమైన గాయకులలో దివంగత మొహమ్మద్ రఫీ నివసించిన ఈ బాంద్రా బంగ్లాలో అతని జీవితంలో సాధించిన పథకాల్ని ప్రదర్శించే మ్యూజియం ఉంది. అవార్డులు ప్రశంసల నుండి సదరు గాయకుడు ఉంచిన వివిధ విలువైన ఆస్తులను సందర్శించవచ్చు.

బాలీవుడ్ `డ్రీమ్ గర్ల్` హేమమాలినికి నగరంలో కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఈ రెండింటినీ బాలీవుడ్ అభిమానులు క్రమం తప్పక సందర్శిస్తారు. పరిశ్రమలో వివాదరహిత క్వీన్ అయిన హేమా మాలిని ఇప్పుడు తన ఇద్దరు కుమార్తెలతో పాటు తన జుహు .. గుర్గావ్ ఇండ్లలో నివసిస్తోంది. ఆమె జుహు నివాసం చుట్టూ ఒక ఖరీదైన సందులో ఇతర ప్రముఖ స్టార్ల గృహాలు ఉన్నాయి. నగరంలో ఈ పార్ట్ బాలీవుడ్ వాళ్ల ఇండ్ల పర్యటనను పరిపూర్ణం చేస్తుంది.

బాలీవుడ్ కు చెందిన మరో క్వీన్ రేఖ బాంద్రాలోని ఖరీదైన ఇంట్లో నివసిస్తోంది. దాని చుట్టూ ఎత్తైన గోడలు.. చెట్లు ఉన్నాయి. బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో సముద్రం పక్కన ఉన్న ఈ బాలీవుడ్ సీనియర్ ఇల్లు ఈ ప్రాంతంలోని ఇతర స్టార్ల ఇళ్లకు సమీపంలోనే ఉంది. అది ఎంతో దూరంలో లేదు. ముంబైలోని ఖరీదైన ఏరియాలో కంగన కార్యాలయాన్ని కూల్చేందుకే బీఎంసీ నోటీసులు జారీ చేసిన వ్యవహారం తెలిసినదే. కార్యాలయాన్ని పార్షియల్ గా కూల్చి వేయడంతో కంగన కోర్టునాశ్రయించింది.

బిగ్ బి అమితాబ్ బచన్.. నగరంలో ప్రతిక్ష మరియు జల్సా అనే రెండు గృహాలను కలిగి ఉన్నారు. ప్రతిక్ష జుహులో విస్తారమైన బంగ్లా.. అలాగే బచ్చన్ తన తల్లిదండ్రులతో తరువాత అతని భార్య జయ బచ్చన్ తో కలిసి అనేక దశాబ్దాలుగా ఇందులో నివసించారు. తరువాత ఈ కుటుంబం జల్సాకు వెళ్లింది. జుహులో మరో మైలురాయి బంగ్లా వీరికి ఉంది.

ఖాన్ లు నివశించే బాంద్రా బ్యాండ్ స్టాండ్ గెలాక్సీ అపార్ట్మెంట్లు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తాయి. అశేష జనాదరణ పొందిన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో.. సోదరులు అర్బాజ్ .. సోహైల్ ఖాన్ లతో సహా నాలుగు దశాబ్దాలుగా ఈ నిరాడంబరమైన అపార్ట్ మెంట్లో నివసించారు. ఇక ముంబై నగరానికే అంబానీల అంటిల్లా ఎంతో ప్రత్యేకమైన భవంతి అన్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఎత్తైన విలాసవంతమైన భవంతిగా అంటిల్యా ప్రఖ్యాతి చెందింది. అలాగే బాద్ షా షారూక్ వైట్ హౌస్ హైలైట్. బాంద్రా యేతర ప్రాంతాల్లో బీచ్ పరిసరాల్లో ఖరీదైన భవంతులు ఉన్నాయి.