టాలీవుడ్ పై డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గేమ్ ప్లాన్ ఏమిటి?

0

ఇప్పుడున్న ఓటీటీల్లో ఏది బెస్ట్? తెలుగు కంటెంట్ పరంగా వైడర్ నెట్ వర్క్ పరంగా ఏ డిజిటల్ కంపెనీ బెస్ట్? అన్నది ప్రశ్నిస్తే.. నిరభ్యంతరంగా అమెజాన్ ప్రైమ్ బెస్ట్ అనే యువతరం అభిప్రాయపడుతోంది. హాలీవుడ్ సహా ఇండియాలో పలు భాషల్లో విజయవంతమైన సినిమాల అనువాదాల్ని లేదా తెలుగు సబ్ టైటిల్స్ తో సినిమాల్ని వీక్షించే సౌలభ్యం ఇక్కడ ఉంది.

కానీ దీంతో పోలిస్తే కాంపిటీటర్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు కంటెంట్ చాలా వెనకబడిందనే చెప్పాలి. ఒకరకంగా తెలుగు మార్కెట్ నెట్ ఫ్లిక్స్ వాళ్లకి ఏమాత్రం వర్కవుట్ కాలేదుట. భారీ ధరలు చెల్లించి తెలుగు సినిమాల హక్కులు కొనేందుకు సదరు సంస్థ సిద్ధంగా లేదట. అయితే ఈ పరిస్థితి నుంచి సదరు డిజిటల్ కంపెనీ బయటపడేందుకు కొత్త ప్లాన్స్ రెడీ చేస్తోందట.

లస్ట్ స్టోరీస్ అనువాదాలతో సౌత్ లోనూ నెట్ ఫ్లిక్స్ గ్రిప్ పెంచుకునే ఆలోచనలతో ఉంది. హిందీ లస్ట్ స్టోరీస్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ తహా కథలు తెలుగులో రెడీ అవుతున్నాయి. లస్ట్ స్టోరీస్- తెలుగు హిట్టవుతుందన్న భావన ఉది. నెట్ ఫ్లిక్స్ పలువురు టాలీవుడ్ యంగ్ దర్శకులతో వివిధ ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోంది. `లవ్ స్టోరీస్` పేరుతో నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ రూపొందించింది. ఇది త్వరలో ప్రారంభమవుతుంది. నలుగురు నాలుగు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించనున్నారు. శివ నిర్వాణ- అజయ్ భూపతి మొదటి రెండు ఎపిసోడ్ల కోసం ఇప్పటికే ఖరారు చేశారు. ఇతర ఇద్దరు దర్శకులు త్వరలో ఖరారు చేయనున్నారు. ఇ వచ్చే ఏడాది నెట్ ఫ్లి క్స్ లో విడుదల అవుతుంది. అలాగే ఇందులో తెలుగు చిత్రాల స్ట్రీమింగ్ హక్కులను కూడా పొందుతోంది.