క్యూట్ త్రిషలో వైల్డ్ యాంగిల్ చూశారంటేనా?

0

క్యూట్ త్రిష జంతు ప్రేమికురాలన్న సంగతి మనందరికీ తెలిసినదే. మూగ జీవాలకు హాని కలిగిస్తే తాట తీస్తుంది. వెంటనే పెటాకు కంప్లయింట్ చేస్తుంది. విమనమ్ ఫేమ్ నటి దుర్గా కృష్ణతో పాటు ఆమె ఒక అందమైన కుక్కపిల్లతో ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసినదే. వారి అభిమానుల ప్రకారం.. ఇది జీతు జోసెఫ్ రాబోయే చిత్రం రామ్ చిత్రీకరణ సమయంలో తీసిన ఫోటో ఇదని త్రిష వెల్లడించింది.

అలాగే త్రిష త్రోబ్యాక్ పిక్చర్ వేరొకటి సామాజిక మాధ్యమాల్లో అంతే వైరల్ గా మారింది. త్రిష లోని దయార్థ్ర హృదయం గురించి తెలిసినవారంతా ఈ లుక్ చూసి షాక్ తింటున్నారు. త్రిష వైల్డ్ గా హార్స్ రైడింగ్ కూడా చేస్తుందా? అంటూ షాక్ తింటున్నారు. ఎంతో నింపాదిగా కనిపించే త్రిషలోని ఈ యాంగిల్ ఇంట్రెస్టింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు బోయ్స్.

అన్నట్టు హీరో శింబుని పెళ్లాడేందుకు త్రిష రెడీ అవుతోందన్న గాసిప్పులు కోలీవుడ్ మీడియాని హీటెక్కించేస్తున్నాయి. అవి కాస్తా ఇరుగు పొరుగు భాషల్లోనూ వైరల్ అయిపోయాయి. శింబు ఓవైపు బుద్ధి మంతుడిలా మారిపోయి కెరీర్ పై శ్రద్ధ పెడుతుంటే త్రిష ఏమో ఇలా చేస్తోందేమిటి! అంటూ ఒకటే ఇదైపోతున్నారంతా.

కెరీర్ సంగతి చూస్తే.. మోహన్ లాల్- త్రిష ప్రధాన పాత్రల్లో ఓ భారీ చిత్రం చిత్రీకరణకు వెళుతోంది. ఇందులో మీరా అనే పాత్రను దుర్గా వ్యాస్ చేయనున్నారు. ఈ చిత్రంలో త్రిష మోహన్ లాల్ భార్య గా.. డాక్టర్ గా కనిపిస్తుందని సమాచారం. దుర్గ త్రిష సోదరిగా కనిపిస్తుందట. ఇంద్రజిత్ సుకుమారన్… బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. కేరళ కాకుండా ఈజిప్ట్- లండన్- ఇస్తాంబుల్ వంటి వివిధ దేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక సంచలన టాపిక్ తో తెరపైకొస్తూనే ఉంది.