కాజల్ కిచ్లు హనీమూన్ పై ట్రోల్స్

0

గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంది. కరోనా కారణంగా ఈ కొత్త దంపతులు హనీమూన్ కు వెళ్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని జీవితంలో ఒక మదురమైన అనుభూతిని ఎందుకు వదులుకోవడం అనుకుని కరోనా కారణంగా ఎక్కువ దూరం వెళ్లకుండా సింపుల్ గా మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ కాజల్ దంపతులు ఫొటోలు షేర్ చేశారు. దంపతులు చాలా రొమాంటిక్ ఫొటో షూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసి వారం పది రోజులు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.

కాజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన వారు కొందరు అయితే కొందరు మాత్రం వీరిని విమర్శించారు. మీరు చేసింది ఏం బాగాలేదు అంటూ కామెంట్స్ చేశారు. మాల్దీవులకు వెళ్లిన ఈ దంపతులు దాదాపుగా రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ కరోనా సమయంలో చాలా మంది కనీసం తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి మీరు చేసిన సాయం ఏంటీ. మీరు ఈ సమయంలో వారికి సాయం చేసి ఉంటే మీ జీవితం మరింత చాలా సంతోషంగా ఉండేది. హనీమూన్ పేరుతో అంత డబ్బు వృదా చేయడం కంటే కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసి ఉంటే బాగుండేది కదా అంటూ కాజల్ కిచ్లు దంపతులను ట్రోల్స్ చేస్తున్నారు.