అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతారు

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2 ని రూపొందించారు. ఈ సీజన్ లో సమంత కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఇందులో తనని సరికొత్త పాత్రలో చూస్తారని సమంత వెల్లడించింది. రొటీన్ పాత్రల్లో తనని ఉహించుకునే వారికి ఈ సిరీస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని.. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కొన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించే అవకాశమిచ్చాయని.. డిసెంబర్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుందని సామ్ పేర్కొంది.

కాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఆమె డీ గ్లామర్ లుక్ లో అందరిని షాక్ కి గురి చేస్తుందట. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో సమంత బ్యాక్ సైడ్ లుక్ ని అందులో రివీల్ చేశారు. ప్యాంటు షర్ట్ ధరించిన సామ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో సామ్ నేషనల్ వైడ్ పాపులర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ లో కూడా మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి లు కొనసాగుతున్నారు. రాజ్ – కృష్ణ డీకే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇది త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.