ఆరు నెలల వ్యవధిలో మెగా ఫ్యామిలీలో రెండు పెళ్లిలు

0

మెగా ఫ్యామిలీలో మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం జరుగబోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిహారిక పెళ్లి ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. చైతన్యతో నిశ్చితార్థం కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

నిహారిక పెళ్లి అయిన ఆరు నెలల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి కూడా జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. తేజూ పెళ్లి బాధ్యతను పూర్తిగా చిరంజీవి మీద వేసుకుని చేయబోతున్నాడట. ఈ విషయంలో ఆయన ఇప్పటికే చర్చలు సంప్రదింపులు మొదలు పెట్టారట.

తెలిసిన వారి ద్వారా సాయి ధరమ్ తేజ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చిరంజీవి సోదరి ప్రస్తుతం తేజూ పెళ్లి కోసం ఎదురు చూస్తుంది. ఆమె కోసం అయినా తేజూ పెళ్లి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది జూన్ జులై వరకు తేజూ పెళ్లి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. నిహారిక పెళ్లి పూర్తి అయిన వెంటనే తేజూ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది.

తేజూ ప్రేమ వివాహం కాకుండా మామయ్య చిరంజీవి చూపించిన అమ్మాయిని చేసుకుంటానంటూ తల్లితో అన్నాడట. దాంతో చిరంజీవి తనకున్న పరిచయాలతో తేజూకు అమ్మాయిని చూస్తున్నారట. ఈ ఏడాది చివరి వరకు లేదా త్వరలోనే తేజూకు తగ్గ ఒక అమ్మాయి ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు షురూ. నిహారిక పెళ్లి అయిన ఆరు నెలలకు కాస్త అటు ఇటుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి కూడా జరిగే ఛాన్స్ ఉందటూ మెగా వర్గాల వారు అనధికారికంగా మీడియా వారితో అన్నారట.