అలా లొంగాల్సొచ్చిందని మిల్కీ తెగ ఇదైపోతోందట

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా కష్టం గురించి తెలిసినదే. తాను ఇటీవల వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ లో కోవిడ్ -19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీనికి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వేగంగానే కోలుకుందని సమాచారం.

అయితే సెట్లో ఎంత క్రమశిక్షణతో ఉన్నా కోవిడ్ కి లొంగాల్సొచ్చిందని మిల్కీ తెగ ఇదైపోతోందట. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా తమ్మూ మరో మాట కూడా చెప్పింది. జ్వరం ఇతర లక్షణాలు వెలుగు చూడగానే వెంటనే తనను అపోలోలో చేర్పించేశారట. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఏ క్లాస్ ట్రీట్ మెంట్ జరిగిందట.

అయితే అందుకు కారకులు ఎవరు? అంటే మెగా కోడలు ఉపాసన అని తెలిసింది. ఉపాసన ఆర్డర్స్ మేరకు అపోలో బృందాలు తమన్నా చుట్టూ గస్తీ కాసి మరీ ట్రీట్ మెంట్ ఇచ్చారట. అత్యుత్తమ ఫెసిలిటీస్ ఇచ్చారట. చరణ్ సహా మెగా కుటుంబంతో తమన్నా ఎంతో సన్నిహితురాలు కాబట్టి ఆ ట్రీట్ మెంట్.. అంత శ్రద్ధ. అయితే మైల్డ్ లక్షణాలే కాబట్టి అంతగా కంగారు పడాల్సిందేమీ లేదు. పైగా తమన్నా ఫిట్నెస్ ఫ్రీక్. రెగ్యులర్ గా కాయ కష్టం చేసే బాడీ కాబట్టి తొందరగా రోగం తగ్గిపోయింది. ఇక ఉపాసన కేర్ కూడా చాలావరకూ సాయమైందన్నమాట.