‘వి’ : సుధీర్ బాబు గురించి కూడా మాట్లాడుకుంటారు

0

నాని 25వ సినిమా ‘వి’ ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అయినప్పటికి విలన్ అయిన నాని గురించే ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సినిమా ట్రైలర్ మరియు ప్రమోషన్ లో కూడా నానికే ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. సినిమా బిజినెస్ అవ్వాలంటే ప్రేక్షకులు రావాలంటే నానిని ముందు పెట్టాలి. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం సుధీర్ బాబు గురించి మాట్లాడుకుంటారు అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

ఈ సినిమా కోసం సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ ను చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నట్లగా అనిపిస్తుంది. ట్రైలర్ లో చిన్న షాట్ లో సుధీర్ బాబు బాడీ మరియు సిక్స్ ప్యాక్ ను చూపించారు. దాన్ని బట్టే ఆయన యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సుధీర్ బాబుకు ఈ సినిమా మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. చేసిన ప్రతి సినిమా బాక్సీఫీస్ వద్ద నిరాశ పర్చుతూ వస్తున్న సమయంలో సుధీర్ బాబు చేసిన ఈ సినిమా ఆయన కెరీర్ లో నిలదొక్కుకునేలా ఉంటుందట.

ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో చేసిన పాత్ర మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నాని వల్ల సుధీర్ బాబు ఔట్ ఫోకస్ అవుతాడేమో అనుకుంటే ఆయన గురించి కూడా సినిమా పూర్తి అయిన తర్వాత మాట్లాడుకుంటారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వి’ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా నివేదా థామస్ నటించింది. మరో హీరోయిన్ గా అధితి రావు హైదరి కనిపించబోతుంది. తెలుగులో విడుదల కాబోతున్న మొదటి పెద్ద ఓటీటీ మూవీ ఇదే అవ్వడంతో అంతా కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.