Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలిచి బుక్కయిన మంత్రి

టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలిచి బుక్కయిన మంత్రి


షూటింగ్ కి పర్మిషన్ కోరితే హీరోయిన్ ని డిన్నర్ కి ఆహ్వానించారట సదరు మంత్రివర్యులు. అది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలవడంతో అది కాస్తా రభసగా మారింది. డిన్నర్ కి రానని సదరు హీరోయిన్ చెప్పగానే షూటింగు లేదూ విందూ లేదు పొమ్మన్నారట మంత్రివర్యులు. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు? మంత్రి గారు ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రస్తుతం షెర్ని అనే సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని మధ్యప్రదేశ్ అడవుల్లోని కొన్ని రేర్ లొకేషన్లలో చిత్రీకరించాల్సి ఉందిట. ఆ క్రమంలోనే షూటింగులకు అనుమతి కోరింది చిత్రబృందం. అయితే అటవీ శాఖ మంత్రి విజయ్ షా విందుకు పిలిచారట. అది కూడా డిన్నర్ కి హీరోయిన్ విద్యా బాలన్ ని ఆహ్వానించారు. కానీ ఆ ఆహ్వానాన్ని బాలన్ తిరస్కరించడంతో షూటింగ్ కి అనుమతులు ఇవ్వడం కుదరదని సదరు మంత్రి గారు అన్నారట. విద్యాబాలన్ చిత్రం ‘షెర్ని’ మధ్య ప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ఆగిపోయిందని ప్రముఖ జాతీయ మీడియా నివేదించింది.

సదరు మీడియా కథనం ప్రకారం.. బాలాఘాట్ జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఓ) చిత్ర బృందం వాహనాలను అడవిలోకి రాకుండా ఆపారు. ఈ ప్రాంతానికి రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అంతకుమించి అనుమతించలేమని ఆపేశారట. దీంతో షెర్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందిట. మంత్రి గారే అందుకు కారణం అంటూ రభస నడుస్తోంది. అయితే ‘విందు’ కి పిలిస్తే రానందుకే మంత్రి కక్ష తీర్చుకున్నారన్న ఆరోపణలు వేడెక్కించాయి.

అయితే మంత్రి వర్యుల వెర్షన్ పూర్తి ఆపోజిట్ గా ఉంది. షూట్ కోసం అనుమతి తీసుకున్న వాళ్లే తనను విందుకు పిలిచారని మంత్రి గారు రివర్స్ గేర్ వేయడం చర్చకొచ్చింది. “వారు నన్ను భోజనం లేదా విందు కోసం అభ్యర్థించారు. ఇప్పుడే అది సాధ్యం కాదని నేను మహారాష్ట్రకు వెళ్ళినప్పుడు వారిని కలుస్తానని చెప్పాను. ఆ తర్వాత భోజనం లేదా విందు రద్దు చేశారు. షూట్ కాదు” అంటూ సదరు మంత్రి వర్యులు రివర్స్ లో వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

COVID లాక్ డౌన్ వల్ల మార్చి మధ్యలో షెర్ని షూటింగ్ ని ఆపేశారు. ఆ తరువాత ఈ అక్టోబర్ లో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రానికి అమిత్ మసూర్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనిషికి జంతువులకు మధ్య సంఘర్షణ నేపథ్యంలో చిత్రమిది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విద్యా నటిస్తోంది. మధ్యప్రదేశ్ దట్టమైన అడవుల్లో కీలక షెడ్యూల్స్ ని ప్లాన్ చేసారు.