రౌడీకో కుక్క పిల్ల.. !

0

పెట్స్ అంటే కొందరికి వల్లమాలిన ప్రేమ. ముఖ్యంగా టాలీవుడ్ లో పెట్ డాగ్ ప్రేమికులు అంతకంతకు బయట పడుతున్నారు. ఇటీవల వరుసగా సోషల్ మీడియాల్లో ట్రెండ్ అయిన సెలబ్రిటీల్ని లిస్టవుట్ చేస్తే అందు లో పెట్స్ తో ఆడుకుంటూ కనిపించిన వారిలో ఓ ముగ్గురి పేర్లు బాగా ఆకర్షించాయి.

చెర్రీకో కుక్క పిల్ల .. రౌడీకో కుక్క పిల్ల.. ఛార్మికి ఇంకో టామీ! అంటూ తాజాగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న అందాల ఛార్మి ఓ బ్రాండెడ్ బ్రీడ్ పెట్ డాగ్ తో ఇచ్చిన ఫోజును నెటిజనులు ఇంకా మర్చిపోనే లేదు. టామీ లాంటి పెట్ డాగ్ తో ఆటలు ఆడుకుంటూ కనిపించింది ఛార్మి.

నిన్నటికి నిన్న రామ్ చరణ్ తన క్యూట్ పెట్ డాగ్ తో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఫోటోలు ఆకట్టుకున్నాయి. చెర్రీ పచ్చికలో పడుకుని ఫోన్ లోకి చూస్తుంటే ఆ పెట్ డాగ్ కూడా ఆ ఫోన్ లో ఏం ఉందో చూస్తోంది. ఇదిగో ఇప్పుడు రౌడీ వంతు. విజయ్ దేవరకొండ చాలా కాలంగా ఓ పెట్ డాగ్ ని పెంచుతున్నాడు. ఇంట్లో ఇది చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఆ పెట్ డాగ్ ని భుజాన వేసుకుని కనిపించాడిలా. రౌడీ గారింట్లో పెరుగుతున్న ఈ పెట్ డాగ్ నామధేయమేమిటో అనే డౌట్ వస్తే .. కచ్ఛితం గా తెలియ జెబుతాం. దీని పేరు తుఫాన్!