Templates by BIGtheme NET
Home >> Cinema News >> దురదృష్టం బాలు గారిని కలుసుకోలేక పోయాను!

దురదృష్టం బాలు గారిని కలుసుకోలేక పోయాను!


వారం రోజుల క్రితం మృతి చెందిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సంస్మరణార్థం తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో బాలు గారి తనయుడు ఎస్పీ చరణ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంతాప సభలో పాల్గొన్న ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ తాను ఒక్కసారి కూడా ఆయన్ను ప్రత్యక్షంగా కలుసుకోలేక పోవడం తన దురదృష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి గొప్ప గాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోయిన బాలు ఆప్తమిత్రుడు దర్శకుడు భారతిరాజా తనకు బాలుతో ఉన్న అనుబంధంను గుర్తు చేసుకుంటూ ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసన్న.. వివేక్.. జయరామ్.. పార్దిబన్.. దర్శకుడు శ్రీనుస్వామి.. గాయిని చిత్ర మరియు గాయకుడు మనో పాల్గొన్నారు. చెన్నైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో సామాజిక దూరం పాటిస్తు నిర్వహించారు.

కోలీవుడ్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ నాన్నగారి సంతాప సభ నిర్వహించినందుకు సినీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంతాప సభలో పాల్గొన్న ప్రముఖులు ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరని ఆయన పాటలు ఆయన్ను ఎప్పటికి బతికి ఉన్నట్లుగానే చూపుతాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 16 భాషల్లో 40 వేల పాటలు పాడిన ఘనత ఆయనది. ఆ ఘనత మరెవ్వరు కూడా సాధించలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన లెజెండ్రీ సింగర్ ఆయనకు మరెవ్వరు సాటి రారు.