వీసాలొచ్చేశాయ్ ఇక అమెరికా వెళ్లడమే తరువాయి

0

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రంగా యూత్ లో క్రేజు ఉన్న చిత్రమిది. `సరిలేరు నీకెవ్వరు` తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెగ్యుర్ షూటింగ్ జనవరి నుంచి అమెరికాలో స్టార్ట్ కాబోతోంది.

వీసా సమస్య కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు వీసా సమస్యలు తీరడంతో ప్రారంభం కాబోతోంది. అయితే జనవరికి టీమ్ అమెరికాకు వెళ్లడానికి రెడీ అవుతుంటే మహేష్ మాత్రం కాస్త చిత్రబృందం కంటే ముందే ఫ్యామిలీతో కలిసి యుఎస్ బయలుదేరుతున్నారట. డిసెంబర్ 24న ఫ్యామిలీతో సహా అమెరికా వెళుతున్నారట. మహేష్ వెళ్లిన సరిగ్గా ఆరు రోజుల తరువాత అంటే డిసెంబర్ 30న టీమ్ మెంబర్స్ అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు. అంటే ఆ ఆరు రోజులు అక్కడ మహేష్ ఫుల్ రిలాక్స్ అవుతారన్నమాట.

అమెరికాలో దాదాపు 45 రోజుల పాటు కీలక షెడ్యూల్ ని షూట్ చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే మైత్రీ సంస్థ సకల ఏర్పాట్లని పూర్తి చేసిందట. వీసాలొచ్చాయ్.. థమన్ అదిరే బీట్స్ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్గా ఎవరు నటిస్తారన్నది తేలాల్సి ఉంది.