బిడ్డా రాజమౌళీ.. బరిశెలతో కొట్టి చంపుతాం: బీజేపీ ఎంపీ బండి సంజయ్ వార్నింగ్!

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ‘కొమురం భీమ్’ గా ఎన్టీఆర్.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇటీవల కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ లుక్ ని రివీల్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో తారక్ ని ఓ మతవిశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించిన యువకుడిగా చూపించడంపై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆదివాసులు నుంచి వ్యతిరేకతగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు బీజేపీ ఎంపీ వార్నింగ్ ఇచ్చే వరకు చేరింది. ఇప్పటికే ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు దీనిపై రాజమౌళి కి వార్నింగ్ ఇవ్వగా.. ఈరోజు తెలంగాణా బీజేపే అధ్యక్ష్యుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏకంగా కొట్టి చంపుతాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

ఎంపీ బండి సంజయ్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ”కొమురం భీమ్ ను కించపరిచేలా సినిమా తీసిన రాజమౌళికి గుణపాఠం తప్పదు. మా బిడ్డను కించపరిచేలా ముస్లిం టోపీ పెట్టినవు. దమ్ముంటే ఓల్డ్ సిటీ లో వున్న ముస్లింలకి కాషాయం కండువా వేసి సినిమా తీయ్. బిడ్డా రాజమౌళీ.. ఈ సినిమా రిలీజ్ చేస్తే బరిగలతో కొట్టి చంపుతాం” అని వార్నింగ్ ఇచ్చాడు. ‘మొలదారం లేనోడికే నువ్వు భయపడితే.. మొలదారం ఉన్నోల్లమి మేమంత చేయాలి’ అని బండి సంజయ్ అన్నారు. రాజమౌళి కి తగిన బుద్ధి చెప్తామని.. సినిమా థియేటర్స్ తగల బెడతామని.. ధ్వంసం చేస్తామని.. కొమురం భీంకి టోపీ ఉంటే సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తాం అని బీజేపీ ఎంపీ సంజయ్ హెచ్చరించారు.