Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఒకేసారి థియేటర్లలో, ఓటీటీ ద్వారా 15 సినిమాలు

ఒకేసారి థియేటర్లలో, ఓటీటీ ద్వారా 15 సినిమాలు


కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది. పలు దేశాల్లో థియేటర్లు ఇంకా మూత బడే ఉన్నాయి. కొన్ని దేశాల్లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా ఉంది. జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇండియాలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో విడుదలకు సిద్దంగా ఉన్న పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ భయపడుతున్నారు. వచ్చే ఏడాది వరకు వేచి చూద్దాం అన్నట్లుగా ఉన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ కండీషన్ పెట్టడం వల్ల పెద్ద సినిమాలకు నష్టం తప్పదని అంటున్నారు. అందుకే పూర్తి స్థాయిలో థియేటర్లు రన్ అయ్యే సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

కొందరు థియేటర్లు ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని ఓటీటీకి వెళ్తున్నారు. అయితే హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ వారు ప్రస్తుతం నిర్మిస్తున్న మొత్తం 15 చిన్నా పెద్ద సినిమాలను వచ్చే ఏడాదిలో ఒకే సారి థియేటర్లతో పాటు ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేవలం థియేటర్లలో విడుదల చేస్తే ఖచ్చితంగా నష్టాలు వస్తాయి. అందుకే ఓటీటీలో కూడా ఒకే సారి విడుదల చేయడం వల్ల భారీగా నష్టాలను తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే తమ సినిమాలన్నీ కూడా విడుదల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయానికి డిస్ట్రిబ్యటూర్లు ఎగ్జిబ్యూటర్లు ఓకే చెప్తారా అనేది చూడాలి. ఈ కొత్త పద్దతి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.