రాపోతో ఉన్నట్టా లేనట్టా మాటల మాయావీ?

0

లాక్ డౌన్ కారణంగా స్టార్ డైరెక్టర్ ల పరిస్థితి విచిత్రంగా మారింది. అప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ నెలలు గడుస్తున్నా పట్టాలెక్కకపోవడం.. ఫిక్స్ చేసుకున్న హీరోలు మరో ప్రాజెక్ట్ లో లాకవ్వకపోవడంతో కొంత మంది స్టార్ డైరెక్టర్లకు ఏదీ తోచడం లేదు. దీంతో మరో కొత్త ప్రాజెక్ట్ ని లైన్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన క్రిష్ చిన్న ప్రాజెక్ట్ ని ఈ మధ్య కాలంలో పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇదే బాటలో క్రిష్ ని ఫాలో అవుతూ ఓ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ 30 చిత్రాన్ని ప్రకటించిన త్రివిక్రమ్ ఆ మూవీని ఇప్పటికీ సెట్స్ పైకి తీసుకురాలేకపోతున్నారు. కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` షూట్ లో బిజీగా వుండటమే. ఈ మూవీ ఫినిష్ చేస్తే కానీ ఎన్టీఆర్ ఫ్రీ కాడు. అది జరిగితేనే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఇది ప్రస్తుతం కుదిరే పని కాదని భావించిన త్రివిక్రమ్ ఈ లోగా మరో ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేలోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

రామ్తో సినిమా ప్లాన్ చేసినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే త్రివిక్రమ్ కు రామ్ కథ చెప్పారని వెంటనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం మొదలైంది. అయితే దీనిపై శనివారం త్రివిక్రమ్ పుట్టిన రోజున క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. దీంతో
రామ్ తో సినిమా వున్నట్టా లేనట్టా అనే అనుమానాలు మొదలయ్యాయి.