Templates by BIGtheme NET
Home >> Cinema News >> OTT లో ఆ ఒక్కటే ఎందుకు నంబర్- 1 అంటే?

OTT లో ఆ ఒక్కటే ఎందుకు నంబర్- 1 అంటే?


థియేటర్లు ఓపెన్ చేయకపోవడంతో ఓటీటీ వెలిగిపోతోంది. థియేటర్లు తెరిచినా ఓటీటీ ఇలానే వెలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూత్ సహా ఫ్యామిలీస్ అన్నీ ఓటీటీలకు అడిక్ట్ అయిపోయాయన్నది ఓ సర్వే. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. జీ5.. డిస్నీ హాట్ స్టార్.. ఈరోస్.. ఆహా ఇలా ఎన్నో ఓటీటీలు తెలుగు ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని రెగ్యులర్ గా అందించేందుకు పోటీపడుతున్నాయి.

ఇక వీటిలో తెలుగు వరకూ ఏది నంబర్ 1…? అంటే నిస్సందేహంగా అమెజాన్ ప్రైమ్ గురించే చెబుతున్నారు. ఇందులో తెలుగు సినిమాలు నేరుగా చూడొచ్చు.. దాంతో పాటే అన్ని భాషల సినిమాలను తెలుగు సబ్ టైటిల్స్ సహా తెలుగు అనువాదాల రూపంలో వీక్షించే వెసులుబాటు ఇతర ఓటీటీలతో పోలిస్తే చాలా ఎక్కువ. నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ దిగ్గజాన్ని బీట్ చేసి తెలుగులో పాపులరైన ఓటీటీగా అమెజాన్ ప్రైమ్ గురించి చెప్పవచ్చు.

రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్లు అన్నీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి. అల వైకుంఠపురములో… ఉమమహేశ్వర ఉగ్రరూపాస్య సహా దక్షిణ భారత చలన చిత్రాలు చాలావరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే కనిపిస్తాయి. తదుపరి నాని- సుధీర్ బాబు `వి`.. సూర్య సూరరై పొట్రు అమెజాన్ లోనే రిలీజవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్- జీ 5- డిస్నీ హాట్స్టార్ వంటి ఇతర ఓటీటీలు పోటీలో ఉన్నా వీటితో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ బెస్ట్ అన్న టాక్ వినిపిస్తోంది.

అయితే ఇలా అమెజాన్ వాళ్లు దూసుకుపోవడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే నిర్మాతల ఫ్రెండ్లీ కావడమేనని తెలిసింది. సినిమాని సైట్ లో ప్రసారం చేసిన 30 రోజుల నుండి సంతకం చేసిన మొత్తాన్ని క్లియర్ చేసేస్తారట. డీల్ వేగంగా మాట్లాడతారు. ఇక నెట్ ఫ్లిక్స్ అయితే ఐదారు నెలల సమయం వెచ్చిస్తే కానీ డీల్ ని పూర్తి చేయదు. చాలా నెమ్మది. తెలుగు మార్కెట్ పై నెట్ ఫ్లిక్స్ కి గ్రిప్ కూడా తక్కువే. ఇలా అయితే అప్పులు చేసిన నిర్మాతలు ఆగుతారా? అందుకే అమెజాన్ ప్రైమ్ ని సురక్షితం అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ భారీ చందాదారులు సినిమాల్ని బంపర్ హిట్లు గా మలుస్తున్నారు.

అమెజాన్ తర్వాత.. హాట్ స్టార్ లాంటి బడా సంస్థ ప్రత్యక్ష తెలుగు విడుదలలను సొంతం చేసుకోవడానికి తెలుగు మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. జీ 5కి నిధుల కొరత ఉందట. సన్ఎన్ఎక్స్ కి తెలుగు పై అంత ఆసక్తి లేదు. ఇతరులకు కూడా ఆసక్తి తక్కువగా ఉండడం వల్లనే అమెజాన్ ని బీట్ చేయలేకపోతున్నారు. ఇక అమెజాన్ మాత్రం సౌత్ లో భారీగా పెట్టుబడులు వెదజల్లేందుకు ఎంతమాత్రం వెనకాడకపోవడం వల్లనే నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించగలుగుతోందట.