మళ్లీ చిరు..త్రివిక్రమ్ మూవీ ముచ్చట

0

చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఆయన చేస్తాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సందర్బాల్లో త్రివిక్రమ్ కూడా తాను చిరంజీవితో సినిమా తీయాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. కనుక వీరిద్దరి కాంబో మూవీ గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో వీరిద్దరి కాంబో మూవీ గురించి కొన్ని రోజులు ప్రముఖంగా ప్రచారం జరిగింది.

కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య మూవీ తర్వాత లూసీఫర్ రీమేక్ ను చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. కాని లూసీఫర్ స్ర్కిప్ట్ విషయంలో కాస్త తేడా కొట్టింది. దాంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆ లోపు ఆచార్య తర్వాత మరో సినిమాను చిరంజీవి చేస్తాడని అంటున్నారు. ఆ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి కోసం త్రివిక్రమ్ కథ రెడీ చేశాడు అనేది సినీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ను ముగించుకుని ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలో కూడా అదే ప్రచారం జరుగుతోంది.