‘నిశబ్దం’ సీక్వెల్ ప్రచారం పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందా?

0

అనుష్క హీరోయిన్ గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన నిశబ్దం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు ముందు చాలా హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇది ఒక ప్రాంతీయ సినిమా కాదని.. ఇదో అంతర్జాతీయ మూవీ అంటూ ప్రచారం చేశారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ మరియు అనుష్క.. మాధవన్.. అంజలి.. షాలిని పాండేతో పాటు హాలీవుడ్ నటుడు కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి. అంతటి అంచనాలున్న సినిమా ప్రేక్షకులను నిరాశ పర్చింది.

దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సినిమాను పూర్తిగా మూకీగా తీయాలని భావించాడట. కాని కమర్షియల్ గా సక్సెస్ అవ్వదనే ఉద్దేశ్యంతో సినిమాను టాకీగా తీశారు. సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి ఉంటే ఒక మోస్తరుగా అయినా ఆడి ఉండేదేమో. ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూడటంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవ్వడం లేదు. సినిమా గురించి ఇప్పటికే నెగటివ్ టాక్ వచ్చింది.

ఇలాంటి సమయంలో సినిమాను నిలిపేందుకు మేకర్స్ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చిత్ర యూనిట్ సభ్యులు సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిశబ్దం సినిమా కథకు సీక్వెల్ కు స్కోప్ లేదు. అయినా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందని అంటున్నారు. ఇలా అయినా సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో అని వారి ప్లాన్ గా తెలుస్తోంది.