అక్టోబర్ 2న ఓటీటీలో ‘ఒరేయ్ బుజ్జిగా’…!

0

కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్స్ మూతబడి ఉండటంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ”ఒరేయ్ బుజ్జిగా” విడుదల కానుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గుండజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ – హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో ‘ఆహా’ యాప్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.