జూనియర్ కేజీఎఫ్ ఫస్ట్ బర్త్ డే

0

కన్నడ సెన్షేషనల్ స్టార్ యశ్ ఇద్దరు పిల్లలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. యశ్ లేదా ఆయన భార్య రాధిక అయిన ఇద్దరు పిల్లలకు సంబంధించిన వీడియోలను మరియు ఫొటలోను షేర్ చేస్తూ ఉండటంతో చిన్నప్పటి నుండే వారు పెద్ద సెలబ్రెటీలు అయ్యారు. వారికి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. యశ్ కూతురు మరియు కొడుకులు సోషల్ మీడియా సెన్షేషన్ అంటూ ఉంటారు. అలాంటి సోషల్ మీడియా సెన్షేషన్ జూనియర్ యశ్ యథర్వ్ యశ్ పుట్టిన రోజు సందర్బంగా భారీ వేడుక కాకుండా చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు.

అతి తక్కువ మంది సన్నిహితల సమక్షంలో యథర్వ్ పుట్టిన రోజును బోట్ లో యశ్ నిర్వహించాడు. చుట్టు నీరు మద్యలో పెద్ద బోట్ లో ఏర్పాటు చేసిన కేక్ ను కొడుకుతో యశ్ కట్ చేయించాడు. ఈ సందర్బంగా తీసిన వీడియో మరియు ఆ వీడియోకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యథర్వ్ బర్త్ డే సందర్బంగా మరింత క్యూట్ గా కనిపిస్తున్నాడు అంటూ యశ్ అభిమానులు అంటున్నారు.

యథర్వ్ కు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలను దేశ వ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ అభిమానులు చెబుతున్నారు. ఇక యశ్ వచ్చే ఏడాది ఆరంభంలోనే కేజీఎఫ్ తో వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. మొన్నటి వరకు యశ్ ఇతర యూనిట్ సభ్యులు హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ షూటింగ్ కు బ్రేక్ తీసుకుని కొడుకు పుట్టిన రోజు వేడుకలో యశ్ పాల్గొన్నాడు.