కేజీఎఫ్ స్టార్ ను తిడుతున్న కూతురు

0

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ అయిన యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో యశ్ పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలతో కూడా ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో యశ్ మరియు ఆయన భార్య రాధికలు రెగ్యులర్ గా పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరు షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నవ్వు తెప్పిస్తోంది.

యశ్ తన కూతురు ఐరాకు ఇటీవల జుట్టు తీయించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టు వెంట్రుకలు తీయిస్తూ ఉంటారు. ఐరాకు కూడా అందులో భాగంగా జుట్టు తీయించినట్లుగా ఉన్నారు. ఐరాను ఎత్తుకుని యశ్ ఉన్న ఈ ఫొటోకు ఫన్నీ కామెంట్స్ చాలా వస్తున్నాయి. నీకేమో అంత జట్టు ఉంది.. నాకున్న కొద్ది జట్టును కూడా తీయించేశావ్ ఎందుకు అన్నట్లుగా యశ్ పై ఐరా కోపంతో చూస్తున్నట్లుగా ఆమె రియాక్షన్ ఉందని కొందరు నెటిజన్స్ అంటుంటే మరికొందరు మాత్రం ఇంకా ఎన్నాళ్లు అలా ఉంటావ్ నాలా గుండు చేయించుకో హాయిగా ఉంటుంది నాన్న అంటూ ఐరా రియాక్షన్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.