యంగ్ హీరోల కెరీర్ కి మెగా మార్గనిర్ధేశనం

0

మెగా కాంపౌండ్ లో ఏం చేయాలన్నా తొలిగా మెగాస్టార్ చిరంజీవి అనుమతి కావాల్సిందేనా?.. అంటే కీలక నిర్ణయాల్లో ఆయన సూచనలు సలహాలు తప్పనిసరి. ముఖ్యంగా యంగ్ హీరోల కెరీర్ కి ఆయన మార్గనిర్ధేశనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండస్ట్రీలో మూడున్నర దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం ఉన్న స్టార్ గా మెగాస్టార్ చిరంజీవి విశ్లేషణ సమీక్ష లేనిదే ఇంకేదీ లేదని మెగా యువహీరోలంతా భావిస్తారు.

ఇప్పటికే రామ్ చరణ్ .. అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా రాణించారంటే మెగాస్టార్ సలహాలు సూచనలు అక్కరకొచ్చాయి కాబట్టే. మెగాస్టార్ అంటే బన్నికి కూడా ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. మావయ్య విలువైన సలహాలతోనే అతడు అంత పెద్ద స్టార్ కాగలిగాడు. మరోవైపు మెగా కాంపౌండ్ లో ఇతర హీరోల కెరీర్ ని షేపప్ చేయాల్సిన బాధ్యత చిరుకే ఉంది.

ముఖ్యంగా నవతరం హీరోలు వైష్ణవ్ తేజ్.. కళ్యాణ్ దేవ్ ల కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. మంచి కంటెంట్ సెలెక్షన్ తో కెరీర్ ని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించాలంటే అందుకు అనుభవజ్ఞుల సలహాలు సూచనలు అవసరం అని ఆ ఇద్దరూ భావిస్తున్నారు. తొలిగా మెగాస్టార్ కథను ఎంపిక చేస్తే.. దాంతో ముందుకు సాగడానికి సంసిద్ధమవుతున్నారు.

కళ్యాణ్ దేవ్ ఇటీవలే `సూపర్ మచ్చి` తొలికాపీని మామగారైన చిరంజీవికి చూపించారట. చిరుకి నచ్చిందా లేదా? అందులో కరెక్షన్స్ ఏవైనా చెప్పారా లేదా? అన్నది చూడాలి. అదేవిధంగా వైష్ణవ్ తేజ్ కొన్ని స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకునే ముందు చిరును అడిగి తుది నిర్ణయం తీసుకోనున్నాడట.

నవతరం హీరోలకు ఇది ఎంతో ఉపయుక్తమైనది. కళ్యాణ్ దేవ్ నటించిన `సూపర్ మచ్చి` 2021లో విడుదల కానుంది. అలాగే వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సంక్రాంతికి రిలీజ్ కానుందన్న సమాచారం ఉంది. ప్రస్తుత సినిమాలతో పాటు భవిష్యత్ సినిమాల విషయంలో మెగా స్టార్ రివ్యూలు అడిగాకే రిలీజ్ చేస్తారు ఈ యంగ్ హీరోలు. కథలు కంటెంట్ విషయంలోనూ ఆయన సలహాలు సూచనలు తప్పనిసరి అన్న రూల్ ఉందిట. ఇక ఇప్పటికే సుప్రీంహీరో సాయిధరమ్ కెరీర్ కోసం మెగాస్టార్ పవర్ స్టార్ సలహాలు సూచనలు నెమ్మదిగా వర్కవుట్ అయిన సంగతి తెలిసిందే.