బిబి4 : అతడికి ఆమెపై ప్రేమ.. అమ్మ గరంగరం

0

ఈ సీజన్ లో మొదటి సారి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు కోడి గుడ్లను కొట్టి ఒకొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. సోమవారం ప్రారంభం అయిన ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ మంగళవారం ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగింది. గుడ్డు కొట్టే పక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యం రాజశేఖర్ మాస్టర్ పై అభిజిత్ మరియు అఖిల్ లు గుడ్డు పగులకొట్టే సమయంలో రచ్చ రచ్చ జరిగింది. అభిజిత్ మరియు అమ్మ ల మద్య జరిగిన గొడవ పతాక స్థాయికి చేరింది. గొడవ మద్యలో కల్పించుకునేందుకు హారిక ప్రయత్నించగా నువ్వు నోరు ముయ్యి అంటూ ఆమెను చాలా గట్టి స్వరంతో అమ్మ రాజశేఖర్ అరవడం ఆమెను బాధ పెట్టింది.

కష్టపడ్డ వారికి బాధ తెలుస్తుంది.. నువ్వు ఏం చేశావ్ అంటూ అభిజిత్ ను అమ్మ రాజశేఖర్ ప్రశ్నించాడు. ఇద్దరి మద్య వాడివేడిగా చర్చ జరిగింది. అఖిల్ వంతు వచ్చిన సమయంలో మీరు వెళ్తా వెళ్తా అంటున్నారు కనుక మిమ్ములను నామినేట్ చేస్తున్నాను అంటూ అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత మోనాల్ ను అఖిల్ నామినేట్ చేశాడు. నీకు క్లారిటీ మిస్ అవుతుంది అంటూ అఖిల్ రీజన్ చెప్పడం మోనాల్ కు అస్సలు నచ్చలేదు. నా నుండి అఖిల్ కు ఫ్రెండ్ షిప్ లో మోర్ లభించలేదు. అందుకే నామినేట్ చేశాడు అంటూ మాట జారేసింది. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు అమ్మ రాజశేఖర్ మోనాల్ అవినాష్ అభిజిత్ మరియు హారిక అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు.

తర్వాత రోజు నామినేషన్ పక్రియ ఇంకా పూర్తి అవ్వలేదు. నామినేట్ అయిన అయిదుగురిలో ఒక్కరు సేవ్ అయ్యే అవకాశం బిగ్ బాస్ ఇస్తున్నాడు. మొహం జాగ్రత్త అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా నామినేట్ అయిన వారు టీ స్టాండ్ పై తల పెట్టి ఉండాలి. వారిని కదిలించేందుకు ఇతరులు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడంకు గడ్డం మట్టి ఐస్ క్యూస్ కొడి గుడ్లు ఇలా ఎన్నో రకాల ఐటెంలను ఉంచారు. వాటితో నామినేట్ అయిన వారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఇది హధ్దు దాటుతుంది అంటూ అభిజిత్ వెళ్లి పోగా హారిక రెండు సార్లు కదలడంతో ఆమెను తప్పించారు.

మిగిలిన ముగ్గురు కూడా కదలక పోవడంతో బజర్ మోగడంతో ఎవరు సేవ్ అవ్వలేదు అంటూ ప్రకటించారు. మోనాల్ పై మట్టి పోసి ఇబ్బంది పెట్టేందుకు సోహెల్ మరియు మెహబూబ్ ప్రయత్నించగా అఖిల్ ఆమె మొహం తుడ్చి ఆమె కళ్లలో మట్టిని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆమెను నామినేట్ చేసినా కూడా అతడికి ఆమెపై ప్రేమ అభిమానం ఉన్నట్లుగానే అనిపించింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఎవరు ఎవరు ఏంటీ ఎవరితో ఉన్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.