‘బిగ్ బాస్’లోకి నోయల్ రీఎంట్రీ?

0

బిగ్ బాస్ నాలుగో సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడిగా కనిపించిన నోయల్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటికి వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను వైదొలగడం వల్లే గత వారం ఎలిమినేషన్ కూడా రద్దు చేశారు. నోయల్ నిష్క్రమించిన సమయంలో అతను మళ్లీ హౌస్లోకి రాడన్నట్లుగానే హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా సంకేతాలిచ్చాడు. కానీ ఇప్పుడు నోయల్ మాటల్ని బట్టి చూస్తే అతను తిరిగి హౌస్లోకి అడుగు పెడతాడేమో అనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ వీక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియోను నోయల్ షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ షోలో ఏమైనా జరగొచ్చు అంటూ పరోక్షంగా తన రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడతను.

ఈ వీడియోలో నోయల్ మాట్లాడుతూ. ఆల్ మై గ్యాంగ్స్టర్స్. ఎలా ఉన్నారందరూ? లవ్ యు ఎ లాట్. నాతో ఉన్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్యూ సోమచ్. నా ఆరోగ్యం గురించి ఎన్నో కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. మీ ప్రేమాభిమానాలు చూసి నేను చాలా ఎమోషనల్గా ఫీలవుతున్నాను. ఇంకా ఏదైనా జరగొచ్చు. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. అయిపోయిందనుకున్నోడు మళ్లీ వస్తే ఆ కిక్కే వేరుంటది కదా. మళ్లీ లైవ్కి వస్తా. డీటైల్స్ అన్నీ చెబుతా. చాలా ఉంది మాట్లాడుకోవడానికి. చాలా రోజుల తర్వాత వస్తున్నా అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అనారోగ్యానికి చికిత్స చేయించుకుని కోలుకున్నాక నోయల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లలో నూతన్ నాయుడు లాంటి ఒకరిద్దరు హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. అదే కోవలో నోయల్ కూడా వస్తాడేమో చూడాలి.