లేడీ ఛాయ్ వాలా రియల్ సక్సెస్ స్ఫూర్తితో

0

నిజ జీవిత కథల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు తీస్తున్న రోజులివి. బయోపిక్ లు కొన్ని అయితే పాక్షికంగా ఒక థీమ్ లైన్ ని రియల్ లైఫ్ నుంచి ఎంపిక చేసుకుని దానిని కమర్షియలైజ్ చేసి సినిమాలు తీయడం ఒక పద్ధతి. ఇప్పుడు ఈ రెండో కోవకే చెందే సినిమా మిస్ ఇండియా అంటూ ప్రచారం సాగుతోంది.

కీర్తి సురేష్ నెట్ ఫ్లిక్స్ చిత్రం `మిస్ ఇండియా`పై ఇప్పటికే రివ్యూలు అంతర్జాలం లో వైరల్ అవుతున్నాయి. మూవీ కంటెంట్ ఎంచుకున్న కథపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు నరేంద్ర నాథ్ మసాలా అంశాల దట్టింపు కోసం పాకులాడి ఒక రియల్ ట్యాలెంటెడ్ లేడీ జీవితకథలో గందరగోళం సృష్ఠించారని.. పాకులాట ఫెయిలైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా లో చాయ్ వ్యాపార గొలుసు ను ఏర్పాటు చేసి బాగా సంపాదించిన ఒక సాధారణ మహిళ మిస్ ఇండియా ప్లాట్లు ఏమిటి? అన్నదే ఈ సినిమా.

ఇది ఒరిజినల్ స్టోరి అని చెప్పక పోయినా.. అమెరికా కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్త.. ఛాయ్ వాలా కథ ఇదన్న గుసగుస వేడెక్కిస్తోంది. భారతీయ రెసిపీని భక్తి చాయ్ పేరుతో అమెరికాలో విక్రయించిన వ్యాపారి కథ ఇది. ఉత్తర భారతదేశం చుట్టూ పర్యటించిన బ్రూక్ ఎడ్డీ భారతీయ చాయ్ రుచి తో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో ఆమె అమెరికాలో చాలా టీ షాపులు అందుబాటులో లేవని తెలుసుకుని .. 2007 లో ఆమె టీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అమెరికా అంతటా ఆ టీ వ్యాపారం ప్రాచుర్యం పొందాక.. 35 మిలియన్ డాలర్లు సంపాదించడం ఒక సంచలనంగా మారుతుంది. బ్రూక్ ఎడ్డీ కథ స్ఫూర్తి తోనే మిస్ ఇండియా మూవీని మలిచారని చెప్పేందుకు రుజువులున్నాయన్న వాదనా వినిపిస్తోంది.