జాంబి రెడ్డి దసరా లుక్..

0

జాంబీ మూవీస్ అనగానే హాలీవుడ్ లో `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ పాపులర్. చనిపోయిన మనిషి వైరస్ రూపంలో జీవించి ప్రపంచ వినాశనానికి దారి తీయడం అన్న కాన్సెప్టుతో ఈ సిరీస్ రక్తి కట్టించింది. తమిళంలో జయం రవి నటించిన జాంబీ (2019) సౌత్ లో ఓ ప్రయోగం.

ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి జాంబీ మూవీ అంటూ ప్రయోగం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ.

“# కొరోనా కంటే ప్రమాదకరమైనది.. మన నుండి నరకాన్ని బయటకు తీయడానికి వస్తోంది!“ అంటూ ఇప్పటికే ప్రచారం పరంగా వేడి పెంచారు. జాంబీరెడ్డి తెలుగులో మొదటి జాంబీ చిత్రం! అని చెబుతున్నారు. అ.. కల్కి తర్వాత ప్రశాంత్వర్మ తదుపరి చిత్రం జోంబీ రెడ్డి మరో ప్రయోగమిది. యాపిల్ ట్రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఇప్పటికే జాంబీ రెడ్డి ప్రచారం పరంగా ఓ మెట్టు పైనే ఉంది. ఇప్పుడు విజయదశమి కానుకగా అమ్మవారి గెటప్ తో కథానాయిక రూపాన్ని రివీల్ చేశారు. అసుర సంహారిని లుక్ ఇది. అమ్మవారిగా త్రిశూలధారియై శత్రుసంహారానికి సిద్ధమవుతున్న ఉగ్ర రూపం ఆకట్టుకుంటోంది. ఆనంది (నందిని రెడ్డి) ఈ పాత్రలో నటిస్తున్నారు. నేపథ్యంలో అమ్మవారి ఉగ్రరూపం భయపెట్టేస్తోంది మరి. తేజ సజ్జా ఈ చిత్రంలో మేల్ లీడ్ గా నటిస్తున్నారు.