Templates by BIGtheme NET
Home >> GADGETS >> శామ్ సంగ్ కు పోటీగా యాపిల్ కొత్త ఫోన్.. ఫీచర్లు చూశారంటే మతి పోవాల్సిందే..!

శామ్ సంగ్ కు పోటీగా యాపిల్ కొత్త ఫోన్.. ఫీచర్లు చూశారంటే మతి పోవాల్సిందే..!


యాపిల్ ఫోన్ అంటే చాలు.. యువత పడిచస్తుంది. అందుకే మార్కెట్లో ఎప్పుడూ ఆ ఫోన్ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఇక అందులో కొత్త ఫోన్ వస్తే దానికి క్రేజ్ మామూలుగా ఉండదు. సెల్ పాయింట్స్ వద్ద క్యూ కట్టేస్తూ ఉంటారు. కాగా ప్రస్తుతం దక్షిణకొరియా సంస్థ శామ్సంగ్ కొత్తగా తీసుకొచ్చిన గెలాక్సీ జెడ్ఫ్లిప్ యువతను తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్కు పోటీగా యాపిల్ కంపెనీ క్లామ్షెల్ లాంటి ఫ్లిప్ ఐఫోన్ను తయారుచేస్తున్నట్టు సమాచారం. దీని హ్యాండ్సెట్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ లాంటి డిజైన్ ను పోలి ఉన్నట్టు సమాచారం.

ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ 2022 లేదా 2023లో బయటకు వచ్చే అవకాశం ఉందని యూఎస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆపిల్ మొదటి ఫ్లిప్ ఐఫోన్ను 2022 సెప్టెంబర్లో లాంచ్ చేయబోతున్నదట. ఈ ఐఫోన్ ఫ్లిప్ మొబైల్ 5జీ సపోర్ట్ తో పనిచేయనున్నట్టు సమాచారం. యూట్యూబర్ జోన్ ప్రోస్సేర్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.

ఆపిల్ చైనాలోని షెన్జెన్లోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో క్లామ్షెల్ లాంటి ఐఫోన్ షెల్ను ప్రస్తుతం తయారుచేస్తున్నట్టు టాక్. కొత్తగా రాబోయే యాపిల్ ఐఫోన్ తెరిచిన వెంటనే పెద్ద డిస్ప్లేతో ఉంటుంది. బయటి షెల్లో కూడా చిన్న డిస్ప్లే కూడా ఉంటుందట.