Templates by BIGtheme NET
Home >> GADGETS >> శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!

శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!


శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ స్మార్ట్ ఫోన్ నేపాల్‌లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ మనదేశంలో జనవరి 7వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండటం విశేషం. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ ధర
ఈ ఫోన్ ధరను 15,999 నేపాల్ రూపాయలుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.9,900) నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ కూడా అక్కడ ప్రారంభం అయిపోయింది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ జనవరి 7వ తేదీన లాంచ్ కానుంది. దీని ధర రూ.10 వేల లోపే ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను అందించారు.

5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ కింద భాగంలో మందం కాస్త ఎక్కువగా ఉండనుంది. వెనకవైపు దీర్ఘచతురస్రాకారంలో కెమెరా మాడ్యూల్ ఉండనుంది. మూడు సెన్సార్లూ ొకే వరుసలో ఉన్నాయి.